Wednesday, May 8, 2024
- Advertisement -

తండ్రిని పొగుడుతూ.. జనాలను తిట్టిన కల్వకుంట్ల కవిత!

- Advertisement -

ఒకవైపు తండ్రినేమో భోళా శంకరుడు అని పొగడ్తల్లో ముంచెత్తింది కల్వకుంట్ల కవిత. అయితే ఆమె ఇదే సమయంలో సామాన్య జనాలపై విరుచుకుపడింది. వారి తీరును తప్పుపట్టింది.

తమ సమస్యలను ఆమె దృష్టికి తీసుకొచ్చిన వారిని కవిత ఆల్ మోస్ట్ తిట్టేసింది! ఇంతకీ విషయం ఏమిటంటే.. ఎంపీ హోదాలో కవిత ‘మన ఊరు మన ఎంపీ’ అనే ప్రోగ్రామ్ ను పెట్టుకొంది. ఇందులో భాగంగా ఆమె కరీంనగర్ జిల్లాలో జనాలతో మమేకం అయ్యింది. మరి కల్వకుంట్ల కవితమ్మ వచ్చిందంటే జనాలు ఆమెకు సమస్యలను విన్నవించుకొంటారు కదా..అక్కడ కూడా అదే జరిగింది.

అయితే తనకు సమస్యలు విన్నవించిన జనాలపై దాదాపు ఆగ్రహావేశాలనే ప్రదర్శించింది కవిత. తమకు పెన్షన్లు రావడం లేదని కొంతమంది బీడీ కార్మికులు విన్నవించుకోగా కవిత వారి తీరును ఖండించింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేలో మీరు బీడీ కార్మికులుగా చెప్పకోకపోవడం వల్లనే మీకు పెన్షన్ రాలేదు.. అని కవిత వారికి స్పష్టం చేసింది. కాబట్టి తప్పు ప్రభుత్వానిది కాదు..మీదే అని ఆమె వారికి తేల్చి చెప్పింది.

ఈ విషయంలో రెండో థాట్ లేదని తప్పు జనాలదే అని ఎంపీ తేల్చేసింది. మరి ఇదే సమయంలో ఆమె తన తండ్రిని భోళా శంకరుడు అని అనడం విశేషం. కేసీఆర్ ఎవరినీ నిరాశ పరచడం లేదని.. ఎవరు ఏం అడిగినా.. వారికి అవి సమకూరుస్తున్నాడని కవిత తేల్చి చెప్పింది! మరి ఎంతైనా తండ్రి..తమ పార్టీ అధినేత కాబట్టి కవితకు ఇలా అనిపించడంలో తప్పేం లేదు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -