Monday, April 29, 2024
- Advertisement -

నాకలాంటి ఆలోచనే లేదు..కెసిఆర్ చెప్పేశాడు..

- Advertisement -

రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పటినుంచి రాజకీయంగా ఎదో ఒక వార్త సంచలనం రేపుతూనే ఉంది.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిన్న మొదలు కాగా కేసీఆర్ రెవిన్యూ చట్టం మీద కీలక నిర్ణయం తీసుకోబోతున్నాడని వార్తలు హల్చల్ చేశాయి.. ఇక కెసిఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించనున్నట్లు వార్తలు షికార్లు చేశాయి.. అయితే కేబినెట్ సమావేశం తర్వాత రెవిన్యూ చట్టం పై వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ ఈ అంశం పై ఒక్క సారిగా గాలి తీసేశారు..

కొత్త రెవెన్యూ బిల్లును ఎల్లుండి శాసన సభ లో ప్రవేశ పెట్టేందుకు సిద్దంగా ఉన్నామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్ లో మాట్లాడిన సీఎం కేసీఆర్, పలు కీలక వ్యాఖ్యలు చేశారు. భారత దేశంలో నే ఎక్కడా లేని విధంగా రెవెన్యూ చట్టం రాబోతుంది అని అన్నారు. అయితే ఈ రెవెన్యూ చట్టం గురించి ప్రజలకు సరైన విధంగా వివరించాలి అని సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే లకు సూచించారు.

అయితే శాసన సభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలను సీఎం కేసీఆర్ వారికి వివరించడం జరిగింది. అయితే సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ గా ఎదిగే అవకాశాలు ఉన్నాయి అని, ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుండి సైతం పలు ప్రశంసలు అందుకున్నారు. పలు రాష్ట్రాల్లో సీఎం కేసీఆర్ ను ఆహ్వానించారు. అయితే దీని పై సీఎం కేసీఆర్ ఇలా అన్నారు. ప్రస్తుతానికి జాతీయ పార్టీ ఆలోచన లేదు అని, సమయం వచ్చినప్పుడు అందరితో చర్చించి పెడతాం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -