Monday, April 29, 2024
- Advertisement -

కేసీఆర్ మాటలు… జగన్ కు షాక్ ఇచ్చాయా..!

- Advertisement -

ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లోని వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీ వైపు వెళ్లింది కేవలం ఇద్దరు ఎంపీలు మాత్రమే అనుకొన్నారంతా. వారు అధికారికంగా ప్రకటించి మరీ పచ్చకండువాలు వేసుకొన్నారు. ఫ్యాన్ గుర్తుపై గెలిచి ఎంచక్కా సైకిలెక్కేశారు.

మరి వారే అనుకొంటే.. వారు మాత్రమే కాదు మరో ఆరుమంది వైకాపా ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశంలో చేరినట్టుగా ఇప్పుడు కేసీఆర్ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది…!

తమ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లోకి చేర్చుకొన్నాడు అంటూ తెలుగుదేశం చేస్తున్న మాటలదాడికి ప్రతిగా తెరాస అధినేత వైకాపా ఎమ్మెల్యేల పేర్లు ప్రస్తావించాడు.

కోన రఘుపతి, ఉప్పులేటి కల్పన, ముస్తాఫ,జలీల్ ఖాన్ తో సహా మొత్తం ఆరు మంది వైకాపా ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీ చేర్చుకొందని కేసీఆర్ వ్యాఖ్యానించాడు. వారితో పాటు ఎస్పీవైరెడ్డి, కొత్తపల్లి గీత వంటి వారి పేర్లను చెబుతూ.. వారందరినీ తెలుగుదేశంలోకి చేర్చుకోవడం అనైతికం కాదా?! మీకు ఫిరాయింపుల చట్టం  చెల్లుబాటు కాదా? మాకు నీతులు చెబుతారా? అంటూ కేసీఆర్ తెలుగుదేశం పార్టీ పై దుమ్మెత్తిపోశాడు. మరి కేసీఆర్ విమర్శలు సంగతలా ఉంటే. .ఈ వైకాపా ఎమ్మెల్యేలు నిజంగానే జంప్ అయినట్టేనా? అనేది ఆసక్తికరంగామారింది.

వీరు అధికారికంగా అయితే తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టుగా ప్రకటించలేదు. కానీ కేసీఆర్ ఏమో వారంతా తెలుగుదేశంలో చేరారని అంటున్నాడు. ఇది వైకాపా అభిమానులుకు, వైకాపా అధినేతకు కూడా కాస్తంత షాక్ ఇచ్చే అంశమే. ఎవరూ పోలేదని అనుకొంటుంటే.. ఆరు మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశంలోకి వెళ్లడం అంటే మాటలు కాదు కదా! ఇంతకీ తెరాస అధినేత మాటల విషయంలో ఆ ఆరుమంది వైకాపా ఎమ్మెల్యేలు ఎలా స్పందిస్తారో చూడాలి! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -