Thursday, May 2, 2024
- Advertisement -

కేర‌ళ‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ఎంత విరాలాలు వ‌చ్చాయో తెలుసా..?

- Advertisement -

వరదలతో అతలాకుతలం అయిన కేరళను ఆదుకోవడానికి అనేక మంది స్పందిస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు, ఉద్యోగ సంస్థలు, ప్రైవేట్ ఆర్గనైజేషన్లు, వ్యాపారస్తులు, విద్యార్థులు, సినిమాసెల‌బ్రిటీస్‌, క్రీడాకారులతోపాటు సామాన్యులు సైతం భారీగా విరాలాలు ఇచ్చిన సంగ‌తి తెల‌సిందే. విదేశాలు సైతం భారీగా విరాలాలు ప్ర‌క‌టించారు.

ఇలాంటి విరాళాల్లో కొన్ని బాధితులకు డైరెక్టుగా అందుతుండగా, మరి కొన్ని మొత్తాలు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందుతున్నాయి. ఇలా అందుతున్న విరాళాల గురించి కేరళ సీఎం కార్యాలయం ఒక ప్రకటన చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు మొత్తం 539 కోట్ల రూపాయల మొత్తం విరాళాలు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన చేసింది.

ఇందులో కేంద్ర ఇచ్చిన స‌హాం వేరు.మరి కొంతమంది వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు… బాధితులను ప్రత్యక్షంగా ఆదుకునేలా సహాయాలు చేస్తున్నారు. దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మొత్తంగా చూసినా విరాళాలు వెయ్యి కోట్ల రూపాయల స్థాయి అందిన దాఖలాలు కనిపిస్తున్నాయి. ఈ స‌హాయం కేర‌ళ‌కు జ‌రిగిన న‌ష్టానికి ఏమాత్రం స‌రిపోదు.

తాజాగా యూఎస్ టెక్ జెయింట్ ‘ఆపిల్’తన వంతు విరాళాన్ని ప్రకటించింది. మొత్తం ఏడు కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించింది ఈ సంస్థ.కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు కొంత మొత్తాన్ని, మరి కొంత మొత్తాన్ని స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా వరద బాధితులకు సహాయం అందించేందుకు ఆపిల్ ముందుకు వచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -