Monday, April 29, 2024
- Advertisement -

ట్రంప్ పోరాటంలో కదలిక లేకపోయిన..!

- Advertisement -

ఎలక్టోరల్ కాలేజీ ఎన్నికలో జో బైడెన్ విజయం సాధించడం రాజ్యాంగ ప్రక్రియలో ఓ ముందడుగు మాత్రమేనని శ్వేతసౌధ ప్రెస్ సెక్రెటరీ కైలీ మెక్​ఎనానీ పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యాయ పోరాటం ఇంకా కొనసాగుతోందని చెప్పారు. బైడెన్ గెలుపును అంగీకరించి వైట్ హౌస్ లోకి ఆహ్వానిస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానం చెప్పారు.

నిజానికి ట్రంప్ న్యాయపోరాటం ఇదివరకే ముగిసిపోయింది. ఎన్నికల ఫలితాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ట్రంప్ దాఖలు చేసిన పిటిషన్​ను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో న్యాయపరంగా ఆయనకు అన్నిదారులు మూసుకుపోయాయి.

మరోవైపు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నుంచి వచ్చిన అభినందన సందేశానికి ట్రంప్ ఇప్పటివరకు స్పందించలేదని తెలిపారు మెక్​ఎనానీ. కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు ట్రంప్ సిద్ధంగానే ఉన్నారని పేర్కొన్నారు. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న నేపథ్యంలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించేంత వరకు ఆగాల్సి ఉందన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -