Tuesday, April 23, 2024
- Advertisement -

ముందస్తు సమరానికి సిద్దం ?

- Advertisement -

రెండు తెలుగు రాష్ట్రాలల్లో రోజురోజుకి పోలిటికల్ హిట్ పెరుగుతూ వస్తుంది. అటు ఏపీలోను, ఇటు తెలంగాణలోను, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ముఖ్యంగా అటు ఏపీ సి‌ఎం వైఎస్ జగన్, ఇటు తెలంగాణ సి‌ఎం కే‌సి‌ఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే ముందస్తు ఎన్నికలకు ఈ ఇద్దరు వ్యూహాలు రచిస్తున్నట్లు స్పష్టంగా అర్థమౌతుంది. ఇటీవల వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వైసీపీ ప్లీనరీ సమావేశాలను నిర్వహించారు వైఎస్ జగన్. ఈ సమావేశాలలో కొన్ని కీలక అంశాలు ప్రస్తావించారు. .

ముఖ్యంగా వైసీపీ కి శాశ్వత అద్యక్షుడిగా కొనసాగేందుకు ఆమోదం పొందారు జగన్. ఇక ఆ తరువాత ఎన్నికలు ఎప్పుడు వచ్చిన సిద్దంగా ఉండాలని, ఈసారి 175 స్థానాలను కచ్చితంగా కైవసం చేసుకోవాలని పార్టీ నేతలకు, అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సూచించారు సి‌ఎం జగన్. అంతే కాకుండా ముందస్తు ఎన్నికలు వచ్చిన ఆశ్చర్యం పోనవసరం లేదని చెప్పడం గమనార్హం. దీంతో జగన్ ముందస్తు ఎన్నికలకు సిద్దమౌతున్నారని తెలుస్తోంది. అటు తెలంగాణలో కూడా సి‌ఎం కే‌సి‌ఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. బీజేపీ వాళ్ళకు దమ్ము ఉంటే ముందస్తు ఎన్నికల తేదీ ప్రకటించాలని, అలా చేస్తే తను అసెంబ్లీ రద్దు చేస్తానని అందరం ముందస్తు ఎన్నికలకు పోదామంటూ సవాల్ విసిరారు. ఈ సవాల్ ను స్వీకరిస్తూ తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ తాము కూడా ముందస్తు ఎన్నికలకు సిద్దంగా ఉన్నామని మీదే ఆలస్యమంటూ బదులిచ్చారు.

దీంతో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు గట్టిగానే కనిపిస్తున్నాయి. గత ఎన్నికల ముందు కూడా కే‌సి‌ఆర్ అర్థాంతరంగా అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళి విజయం సాధించి తిరిగి ప్రభుత్వాన్ని స్థాపించారు. ఇక ఈ సారి కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్ళి విపక్షలకు షాక్ ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారనే వార్తలకు.. కే‌సి‌ఆర్ చేసిన వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇక ఏపీలో కూడా వైఎస్ జగన్ ముందస్తూ ఎన్నికలకు వెళ్తారని గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నప్పటికి.. ప్లీనరీ సమావేశాల ద్వారా ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని జగన్ క్లారిటీ ఇచ్చారు. మరి రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన ఈ ముందస్తు ఎన్నికల సమరం.. ఒకవేళ నిజమైతే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.

Also Read

కే‌సి‌ఆర్ ఫైర్.. వెనుక అసలు కారణలెంటి .?

జగన్నాటకం.. అంతా నాఇష్టం !

విడ్డూరం : మూడు పార్టీల్లో “జంపింగ్ జపాంగ్ ” ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -