Monday, April 29, 2024
- Advertisement -

లెఫ్ట్ కోటకు రెండోసారి బీటలు

- Advertisement -

మమతా బెనర్టీ. కోల్ కతా కాళిక. సిపిఎం కోటను రెండోసారి బద్దలు కొట్టి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. దీదీగా అందరూ ప్రేమగా పిలుచుకునే 61 ఏళ్ల మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ లో సింగిల్ సివంగిలా గెలిచారు. ఆమె నూతన క్యాబినెట్ లో ఏకంగా 41 మంత్రి మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకావడం విశేషం.

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిషేధించింది. అయితే ఆ పార్టీ జాతీయ నాయకుడు, కేంద్రం మంత్రి అరుణ్ జైట్లీ మాత్రం ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ఆయనతో పాటు కేంద్రం పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావడం విశేషం. ఇక బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉత్తర ప్రదేశ్ సిఎం అఖిలేష్ యాదవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా వచ్చారు.

రాష్ట్రీయ జనతాదళ్ నేత లాలూ ప్రసాద్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా, డిఎంకె నాయకురాలు కనిమొళి కూడా ఈ కార్యక్రమానికి వచ్చింది. ఇంతమంది నాయకులు ఒకేచోట చేరడంతో మరోసారి ఫెడరల్ ఫంట్ర్ ఆలోచన తెరపైకి వచ్చేట్లుగా కనిపిస్తోంది. సాధారణ కాటన్ చీర, హవాయి చెప్పులతో ప్రమాణ స్వీకారానికి వచ్చిన మమతా బెనర్జీ తన ప్రమాణ స్వీకారం కార్యక్రమం మాత్రం అట్టహాసంగా చేశారంటూ వివిధ పార్టీలు విమర్శించడం విశేషం. ఇక ప్రమాణం చేసిన మంత్రులంతా తమిళనాట జయలలిత పాదాలకు నమస్కరించినట్లుగానే మమతా బెనర్జీకి పాదాభివందనం చేయడం కూడా విమర్శలకు తావిచ్చింది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -