Friday, May 3, 2024
- Advertisement -

వైసీపీ, టీడీపీ మ‌ధ్య మాట‌ల యుద్ధానికి దారితీసిన దోమ‌ల డేటా

- Advertisement -

వైసీపీ, టీడీపీ ల మ‌ధ్య ట్విట్ట‌ర్ వార్ శ్రుతిమించిపోతోంది. టీడీపీ మాజీ మంత్ర నారాలోకేష్ గ‌త రెండు రోజులుగా ట్విట్ట‌ర్‌లో సీఎం జ‌గ‌న్‌పై రెచ్చిపోతున్నారు. అంతే స్థాయిలో వైసీపీ కూడా కౌంట‌ర్ ఇస్తోంది. అయితే లోకేష్ మాత‌రం ఏమాత్రం త‌గ్గ‌డంలేదు. లోకేష్ ట్విట్ట‌ర్ విమ‌ర్శ‌ల‌కు వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డికూడా ఘాటుగానె రెస్పాండ్ అవుతున్నారు.

తాజాగా లోకేష్‌, విజ‌య‌సాయి మ‌ధ్య ఆడ‌, మ‌గ దోమ‌ల వ్యాఖ్య‌లు చిచ్చురేపుతున్నాయి. దోమల పేరు చెప్పి కోటిన్నర ప్రజాధనాన్ని స్వాహా చేశారంటై గత టీడీపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు విజ‌య‌సాయిరెడ్డి. “విజయవాడలో దోమల గుంపుల రియల్ టైమ్ డ్యాటా, అవి ఆడో మగో తెలుసుకోవడానికి రూ.1.5 కోట్లు నాకేశారు. ప్రపంచంలో ఎక్కడా దోమల డేటా సేకరించే మూర్ఖపు ప్రయత్నం జరిగిన దాఖలాలు లేవు. దోమల పేరు చెప్పి కోటిన్నర ప్రజాధనాన్ని గుటకాయస్వాహ చేయడం మొదటిసారి వింటున్నాం.” అంటూ ట్వీట్ చేసి చర్చకు తెరలేపారు.

మరోసారి మాజీ మంత్రి నారా లోకేష్‌పై సెటైర్లు వేశారు సాయిరెడ్డి… “మంగళగిరి ప్రజలు ఈడ్చి కొట్టిన తర్వాత లోకేష్‌ చిటికెడు మెదడు మరింత చిట్లినట్టుంది. స్థాయికి మరచి చెలరేగుతున్నారు. మీ తండ్రి చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకుని మాపై కుట్ర చేశారు. ఇప్పడు అదే చిదంబరం, ఆయన కొడుకు బెయిలుపై ఉన్నారు. మీ దొంగల ముఠాకు మూడే రోజు దగ్గర్లోనే ఉంది.” అంటూ హెచ్చరించారు.

వైఎస్సార్‌సీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే నడిరోడ్డుపై నరికేస్తానంటూ ఓ జర్నలిస్టును బెదిరించారని నారా లోకేశ్ శుక్రవారం సంచలన ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ట్వీట్‌కు ఓ ఆడియో క్లిప్‌ను కూడా జత చేశారు. దీనిపైనె రెండు పార్టీల మ‌ధ్య ట్విట్ట‌ర్ వార్ జ‌రుగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -