Sunday, April 28, 2024
- Advertisement -

బాబుకు వరంగా మారుతున్న మోడీ నిర్ణయం

- Advertisement -

తెలుగుదేశం పార్టీని ఏపీలో లేకుండా చేయాలని కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ కృతనిశ్చయంతో ముందుకెళ్తోంది. మొన్నటివరకు అధికారంలో ఉన్న టీడీపీని నాయకులను లాగేసిన క్యాడర్, క్షేత్రస్థాయిలో మాత్రం టీడీపీ బలంగానే ఉంది. దాదాపు 65 లక్షల సభ్యత్వంతో అతిపెద్ద ప్రాంతీయ పార్టీల్లో ఒకటిగా టీడీపీ ఉంది.

ఇప్పుడు బీజేపీ, వైసీపీ ఎంత దెబ్బతీయాలనుకుంటున్నా టీడీపీలో ఉన్న సీనియారిటీ, కేడర్.. సీనియర్ మంత్రులు వైసీపీకి లేరనడంలో ఎలాంటి సందేహం లేదు. వైసీపీ మంత్రుల్లో కొందరికి తప్పితే గతంలో మంత్రులుగా చేసిన వారు లేరు. అంతా కొత్తవారు. సామాజిక కోణంలో మంత్రులైన వారే.

అయితే ఇప్పుడు వైసీపీ ఎంత దూకుడుగా వెళుతున్నా కేంద్రంలోని బీజేపీ అండదండలున్నా.. సొంతంగా బలపడాలన్న బీజేపీ కాంక్ష వైసీపీని కలవరపెడుతోంది. వచ్చే మూడున్నరేళ్లలోనే అటే 2023 కే జమిలి ఎన్నికలు పెట్టాలని బీజేపీ యోచిస్తోంది. అదే జరిగితే పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ మరోసారి ఎన్నికలు ఎదుర్కోవాలి. అధికార ముచ్చట తీరకుండానే జగన్ జనంలోకి వెళ్లాలి.

ఇక ఇదే జమిలి ఎన్నికలకు టీడీపీ స్కెచ్ గీస్తోంది. వైసీపీ ఫిరాయింపులు చేయకపోవడంతో టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఎవరూ వైసీపీలో చేరడం లేదు. మోడీ తెచ్చే జమిలి ఎన్నికల్లో సత్తా చాటాలని బాబు కార్యకర్తలు, నేతలకు ఇప్పటి నుంచే దిశానిర్ధేశం చేస్తున్నారట.. మరి జగన్ ఈ మూడున్నరేళ్లలోనే అన్ని పథకాలు అమలు చేసి తనమార్క్ చూపించుకోవాలి. లేదంటే జమిలితీ ఇటు టీడీపీకి , అటు వైసీపీకి కష్టంగా ఉంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -