Thursday, May 9, 2024
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ఎస్‌ఈసీగా బాధ్యతలు తీసుకున్న నీలం సాహ్నీ!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్ఈసీ (స్టేట్ ఎలక్షన్ కమిషనర్)గా మాజీ సీఎస్, ఐఏఎస్ అధికారిణి నీలం సాహ్నీ, ఈ ఉదయం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మర్యాదపూర్వకంగా గవర్నర్‌ను బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను నీలంసాహ్ని కలవనున్నారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

నిన్నటితో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీకాలం పూర్తికాగా, అంతకుముందే నీలం సాహ్నీ నియామకాన్ని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 10లోపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తయ్యేలా షెడ్యూల్ విడుదల చేయనున్నారు.

వెంటనే మిగిలిన మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. నీలం సాహ్నీ బాధ్యతలు స్వీకరించిన తరువాత కమిషన్ కార్యదర్శి కన్నబాబుతో పాటు ఇతర ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛాలిచ్చి ఆమెను అభినందించారు.

రజినీకాంత్ కి ప్రతిష్టాత్మక ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డ్!

త్రిపురలో ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం!

తెలంగాణ లో కేవలం వారికే కరోనా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -