Sunday, April 28, 2024
- Advertisement -

చివరిక్షణంలో ప్లాన్ ఫ్లాఫ్

- Advertisement -

ఖాతాదారుల నుంచి దాదాపు 24 వేల కోట్ల రూపాయలు సమీకరించి చెల్లింపులో దొరికిపోయిన ఆర్ధిక నేరగాడు, సహారా గ్రూప్ చైర్మన్ సుబ్రతో రాయ్ కూడా దేశం వదిలి పారిపోయేందుకు ప్రయత్నించారని సెబి న్యాయవాది అరవింద్ దాతర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆదివారం నాడు న్యూఢిల్లీలో ఓ సమావేశంలో పాల్గొన్న అరవింద్ దాతర్ మాట్లాడుతూ సుబ్రతో అరెస్టుకు కొన్ని వారాల ముందు పారిపోవాలని ఆయన ప్లాన్ చేసుకున్నారని చెప్పారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, బ్రిటన్ ప్రధాని టోని బ్లెయిర్ లతో  పరిచయం ఉన్న సుబ్రతో రాయ్ వ్యాపార చర్చల పేరుతో  ఉడాయించాలనుకున్నారని అరవింద్ చెప్పారు.

ముందుగా ఐదు వేల కోట్లు డిపాజిట్ చేయాలని, మరో ఐదు వేల కోట్లకు హామి ఇస్తే బెయిల్ ఇస్తామంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నిధుల సమీకరణకు సహారా గ్రూప్ తంటాలు పడుతోంది. వడ్డీతో కలిపి సహారా గ్రూప్ ఇన్‌వెస్టర్లకు దాదాపు 35 వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -