Monday, April 29, 2024
- Advertisement -

చేప వ‌చ్చింద‌ని షేక్ అవుతున్న జ‌ప‌నీయులు

- Advertisement -

జ‌పాన్ ప్ర‌జ‌లంతా ప్ర‌స్తుతం ఆందోళ‌న‌లో ఉన్నారు. కార‌ణం ఓ చేప సముద్ర ఉప‌రిత‌లంలో క‌నిపించ‌డం వారిలో క‌ల‌క‌లం రేపుతోంది. అదేంటీ చేప ఒడ్డుకు వ‌స్తే చ‌క్క‌గా కూర వండుకునో లేక ఫ్రై చేసుకొని తిన‌కుండా ఎందుకంత వ‌ర్రీ అవుతున్నార‌నుకుంటున్నారా? దీని వెనుక పెద్ద కార‌ణ‌మే ఉంది.

ఓర్ ఫిష్‌.. ఇది స‌ముద్రంలో 200 నుంచి వెయ్యి మీట‌ర్ల లోతున జీవిస్తుంది. 4 మీట‌ర్ల వ‌ర‌కు పెరిగే ఈ చేప‌ను స‌ముద్ర దేవ‌డు పంపే దూత‌గా భావిస్తారు జ‌పాన్ దేశ‌స్థులు. ఈ చేప రాక ఏదో ప్ర‌మాదాన్ని సూచిస్తుంద‌ని.. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తం కండి అని స‌ముద్ర దేవుడు ఈ చేప‌ను పంపిస్తాడ‌ని అక్క‌డి వారు న‌మ్ముతారు. ఇవి ఒడ్డుకు వ‌స్తున్నాయంటే త్వ‌ర‌లో భూకంపమో, సునామీనో రాబోతుంద‌ని అర్థ‌మట‌. ఇంత‌కు ముందు ఇది చాలా సార్లు రుజువైందంటారు అక్క‌డి స్థానికులు. అందుకే ఈ చేప ఒడ్డుకు రావ‌డం అక్క‌డి వారిలో పెద్ద క‌ల‌క‌ల‌మే రేపింది. గ‌డ‌చిన వారంలో ఈ చేప సముద్ర ఉప‌రిత‌లంలో జాలర్లు వేసిన వ‌ల‌కు చిక్క‌కుంది. స‌ముద్రంలో ఎక్క‌డో ఉండాల్సిన చేప ఉప‌రిత‌లానికి వ‌చ్చిందంటే ఏదో కీడు జ‌రుగుతుంద‌ని తెగ మ‌ద‌న‌ప‌డి పోతున్నారు జ‌పాన్ వాసులు.

మ‌రోవైపు స‌ముద్ర అంత‌ర్భాగంలో ఏమైనా భూకంపాలు సంభ‌వించిన‌ప్పుడు ఈ చేప‌లు ఉప‌రిత‌లానికి రావ‌డం స‌హాజ‌మే.. ఖంగారు ప‌డాల్సిందేమీ లేదంటున్నారు మెరైన్ సైంటిస్టులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -