Tuesday, May 7, 2024
- Advertisement -

వీరి కలయికను వ్యతిరేకించిన చైనా

- Advertisement -

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రముఖ ఆధ్యాత్మిక మత గురువు దలైలామా అమెరికాలో కలుసుకున్నారు. వైట్ హౌస్ లోని మాప్ రూమ్ లో వీరిద్దరు సమావేశమయ్యారు. వీరిద్దరు ఒబామా అధికారిక సమావేశ మందిరం ఓవల్ లో కాకుండా వైట్ హౌస్ లో సమావేశం కావడం కూడా చర్చనీయాంశం అవుతోంది. ఈ సమావేశానికి మీడియాను అనుమతించకపోవడం విశేషం.

వీరిద్దరు సమావేశం కావడం ఇది నాలుగో సారి. ఇక వీరిద్దరి కలయికను చైనా తీవ్రంగా వ్యతిరేస్తోంది. చైనా చేస్తున్న హెచ్చరికలను ఒబామా ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. వీరిద్దరు మానవ హక్కులు, సమానత్వం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై చర్చించుకున్నట్లు వైట్ హౌస్ అధికార ప్రతినిధి జోష్ ఎర్నెస్ట్ తెలిపారు. ఇది పూర్తిగా వ్యక్తిగత సమావేశమని, ఇందులో ద్వైపాక్షిక అంశాలు ఏమీ లేవని ఆయన స్పష్టం చేశారు.

ఈ భేటి అనంతరం ఇటీవల అర్లెండో లో నైట్ క్లబ్ లో జరిగిన దాడిలో మరణించిన వారికి దలైలామా సంతాపం తెలిపారని వైట్ హౌస్ ప్రకటించింది. ఇక దలైలామాను చైనా వేర్పాటు వాదిగా పేర్కొనడం, అమెరికా అధ్యక్షుడితో కలిసిన ప్రతి సారి ఆగ్రహం వ్యక్తం చేయడం చేస్తోంది.  స్వేచ్ఛఅంటూ తమ సార్వభౌమాధికారాన్ని, అంతర్గత భద్రతను దెబ్బతీయాలనుకుంటే మాత్రం ఊరుకునేది లేదని  చైనా మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో హెచ్చరించింది. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించమని కూడా చైనా హెచ్చరించింది.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -