Sunday, April 28, 2024
- Advertisement -

Corona New Variant: మరో ముప్పు ముంచుకొస్తుంది

- Advertisement -

దక్షిణాఫ్రికాలో విజృంభిస్తున్న కరోనా వైరస్ కొత్త రకం ఒమిక్రాన్ వేరింయంట్. ఇది ప్రస్తుతం ప్రపంచ దేశాలను హడలెత్తిస్తుంది. సౌతాఫ్రికా నుంచి ఐర్లాడ్ వేళ్లిన 26 మంది ప్రయాణికులకు ఒమిక్రాన్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. వాళ్లు ప్రయాణించిన విమానంలో 600 మంది ప్రయాణికులు ఉన్నట్లు ఐర్లాండ్ ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఈ వేరియంట్ భారిన పడ్డ వారికి ఐర్లాండ్ ప్రభుత్వం చికిత్స అందిస్తుంది.

ఈ వేరియంట్ కోవిడ్ టీకాలు వేసుకున్న వారికి సైతం వ్యాప్తి చెందుతుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపింది. కరోనా వైరస్‌తో పోలుస్తే ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని, ప్రపంచ దేశాలు అశ్రద్ద వహించకూడదని పేర్కొంది. దీంతో ప్రపంచ దేశాలు అలర్ట్ అయ్యాయి. వారి దేశాల్లోకి ఆఫ్రికా దేశాల నుంచి విమానాలు రాకుండా నిశేధం విధించాయి.

కేంద్ర మంత్రి వర్గం అత్యవసర సమావేశం అయ్యింది. ఒమిక్రాన్ వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో ముదస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంది. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు ఖచ్చితంగా ఐసోలేషన్‌లో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతీ ఒక్కరు కచ్చితంగా మాస్క్‌ ధరించే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్టాలకు ఆదేశాలు జారీ చేసింది.

రెడ్ అలర్ట్…. ఏపీ,తమిళనాడుకి భారీ వర్ష సూచన!

భగ్గుమంటున్న కూరగాయల ధరలు

కొవిడ్ కొత్త వేరియంట్‌.. మహారాష్ట్ర అలర్ట్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -