Monday, April 29, 2024
- Advertisement -

మోడీపై రగిలిపోయి ఇమ్రాన్ అన్న మాట ఇదీ..

- Advertisement -

భారత ప్రధాని నరేంద్రమోడీ తీరుపై హాట్ కామెంట్ చేశారు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. తాజాగా న్యూయార్క్ టైమ్స్ అనే విదేశీ మీడియాతో మాట్లాడుతూ భారత్ పై తన అక్కసును వెళ్లగక్కాడు ఇమ్రాన్. శాంతి కోసం భారత్ తో తాను చర్చలు జరిపేందుకు ప్రయత్నించిన ప్రతీసారి భారత్ కేవలం బుజ్జగింపులు చేస్తోందని.. మోడీ తమ సైన్యాన్ని సరిహద్దుల్లో దెబ్బతీస్తున్నారని ఇమ్రాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

భారత్ శాంతికి వెళితే బార్డర్ మా సైనికులను దెబ్బతీస్తున్నారని ఇమ్రాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక కశ్మీర్ విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయంపై త్వరలోనే అంతర్జాతీయ వేదికలపై పోరాడేందుకు రెడీ అయినట్టు ఇమ్రాన్ తెలిపాడు. ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ న్యాయస్థానంలో దీన్ని ఎదుర్కొంటామని తెలిపారు.

రెండు అణ్వస్త్ర బలం ఉన్న దేశాల మధ్య రోజురోజుకు యుద్ధ వాతావరణం నెలకొంటోందని ఇమ్రాన్ ఖాన్ జాతీయ మీడియా ముందు మొసలికన్నీరు కార్చాడు. ఇక నుంచి కశ్మీర్ పై అంతర్జాతీయంగా ఏదో ఒకటి తేల్చుకుంటామని స్పష్టం చేశారు.

కాగా భారత్ పై ఏమీ చేయలేక పాకిస్తాన్ రగిలిపోతోంది. అందుకే ఇమ్రాన్ ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ అంశాన్ని లేవనెత్తేందుకు రెడీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కానీ మెజార్టీ దేశాలు భారత్ కు సపోర్టుగా ఉండడంతో పాకిస్తాన్ పప్పులు ఉడకడం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -