Tuesday, April 30, 2024
- Advertisement -

అమీత్‌షా కాన్వాయ్‌పై రాళ్ల‌దాడి…

- Advertisement -

తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శనార్థం ఈ ఉదయం వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ప్రత్యేక హోదా సెగ తగిలింది. ఆయనకు అడుగడుగునా చుక్కెదురైంది. ప్రజలతో పాటు శ్రీవారి భక్తులు కూడా ఆయన రాకను నిరసిస్తూ నినాదాలు చేశారు. అమిత్ షా వస్తున్నారన్న సమాచారాన్ని ముందే తెలుసుకున్న తిరుపతి వాసులు, అలిపిరి వద్దకు చేరుకుని పెద్దఎత్తున నినాదాలు చేశారు.

దీంతో తిరుమలలోని అలిపిరి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీవారి దర్శన అనంతరం అక్కడి నుంచి తిరిగి వెళ్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కాన్వాయ్‌ను ఆందోళనకారులు అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. నల్లబ్యాడ్జీలు ధరించిన నిరసనకారులు.. అమిత్ షా గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

అమిత్ షా కాన్వాయ్‌పై రాళ్ల దాడి చేయడంతో నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై స్పష్టమైన హామీ ఇవ్వాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.

అమిత్ షా కాన్వాయ్ వెళుతుంటే, రహదారి పక్కన ఉన్న భక్తులు హోదా కోసం నినాదాలు చేశారు. అమిత్ షాకు స్వాగతం పలికిన టీటీడీ అధికారులు, ప్రొటోకాల్ ప్రకారం దర్శన ఏర్పాట్లు చేసి, తీర్థ ప్రసాదాలు అందించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -