Monday, April 29, 2024
- Advertisement -

రోజా మౌనం వెనుక కారణమదేనా?

- Advertisement -

ఫైర్ బ్రాండ్ రోజా.. గడిచిన చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉండి చంద్రబాబుతో ఢీ అంటే ఢీ అని మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయారు. బాబుపై పరుష విమర్శలు చేస్తూ ఇరుకునపెట్టారు. అసెంబ్లీ గడప కూడా తొక్కనీయకుండా చంద్రబాబు అడ్డుకున్న కోర్టులకెళ్లి పోరాడారు. జగన్ పై ఎవరైనా విమర్శలు చేస్తూ శివంగిలా లేచి వారిపై పదునైన కౌంటర్లు ఇచ్చేవారు..

కానీ ఇప్పుడు రోజాలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఆమె పూర్తి సంయమనంతో వ్యవహిస్తున్నారు. తనపై పడ్డ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ కు పూర్తి ఆపోజిట్ గా వ్యవహరిస్తున్నారు. రోజా తీరు చూసి వైసీపీ నాయకులతోపాటు ఆమె సన్నిహితులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. జగన్ తోపాటు మంత్రులు, అంబటి లాంటి ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబుపై విరుచుపడుతున్నారు. కానీ రోజా మాత్రం మునిపటిలా అసెంబ్లీలో జగన్ కు సపోర్టుగా కౌంటర్లు ఇవ్వడం లేదు.మౌనంగానే ఉండడం గమనార్హం.

ఇంతకు ముందు ఫైర్ బ్రాండ్ లా చెలరేగిపోయిన రోజాపై చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రియే లేనిపోనివి చెప్పి మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నారన్న ప్రచారం జరిగింది. మంత్రి పదవి రాకపోవడంతో రోజా తీవ్ర మనస్థాపం చెందారు. మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి లేకుండా హైదరాబాద్ వెళ్లిపోయారు. రోజా ఫ్యాన్స్ కూడా ఆమెకు మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై సోషల్ మీడియాలో వాపోయారు. మంత్రి పదవి రాకపోవడంతోనే రోజా ఇప్పుడు ఇలా మౌనంగా ఉంటున్నారన్న చర్చ సాగుతోంది. తన సహజసిద్ధ ధోరణికి భిన్నంగా రోజా మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. ఏపీఐఐసీ చైర్మన్ గా ఎన్నికైనా కూడా సాదాసీదాగానే ఉంటున్నారు. ఇలా రోజా మౌనం ఇప్పుడు వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -