Tuesday, April 30, 2024
- Advertisement -

ఇదేమి న్యాయం అంటున్న సమాజం

- Advertisement -

ఓ అమ్మాయి వీధిలోంచి నడిచి వెళ్లిపోతూంటుంది. ఓ విలన్ ఆ అమ్మాయి వెంట పడతాడు. ఏడిపిస్తా డు. చెయ్యి పట్టుకుని లాగుతాడు. ఆ అమ్మాయి బెంబేలెత్తిపోతుంది. ఇవన్నీ సిసి ఫుటేజ్ లో ఉంటాయి. ఆ అమ్మాయి ధైర్యం చేసి పోలీసు కేసు పెడుతుంది. రెండు రోజులు హడావుడి. ఆ అమ్మాయిని ఏడిపించిన విలన్ ఓ మంత్రిగారి కుమారుడు.

ఇంకేముంది. రెండు రోజుల తర్వాత పోలీసుల దగ్గరకు ఆ అమ్మాయి వచ్చి ఆ విలన్ నాకు తెలీదు. కేసు వాపసు తీసుకుంటున్నానని చెబుతుంది. అంతే ఇంకేముంది కేసు క్లోజ్. ఇదీ మన తెలుగు సినిమాల్లో కనపడే రొటీన్ సీన్. అయితే ఇక్కడ ఇది నిజ జీవితంలో జరిగింది. ఎవరికి అనుకుంటున్నారేమో.. ఎపి మంత్రి రావెల కిషోర్ బాబు పుత్రరత్నం విషయంలో. ఆ మధ్య రావెల సుశీల్ అనే మంత్రి గారి కుమారుడు ఓ ముస్లీం యువతిని నడిరోడ్డపై చేయి పట్టుకుని లాగాడు. అది అలా అలా పెరిగి పెద్దదైంది. ఆ అమ్మాయి పోలీసు కేసు కూడా పెట్టింది. ఇది ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ చేయించారని మంత్రి రావెల కిషోర్ ఆరోపించారు కూడా.

అయితే రెండు నెలల తర్వాత ఆ ముస్లీం అమ్మాయి పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు విత్ డ్రా చేసుకుంది. పైగా రావెల సుశీల్ ఎవరో తనకు తెలియదని కూడా వాగ్మూలం ఇచ్చింది. దీంతో పోలీసులు ఈ కేసు కొట్టేశారు. సినిమాలో సీనే ఇక్కడా రిపీట్ అయ్యింది కదా. మరి మంత్రిగారబ్బాయా.. మజాకా.. ఇక రావెల సుశీల్ వంటి వారు… మరో మంత్రి కుమారుడు యదేచ్ఛగా అమ్మాయిల వెంట పడడానికి ఇదో మంచి అవకాశం. అయ్యా.. చంద్రబాబు గారు ఇక్కడ శాంతి భద్రతలు బాగున్నాయి. ఈ విషయం రావెల సుశీల్ విషయంలో రుజువైంది. ఇక మీరు విదేశాలకు వెళ్లి ఈ విషయమే చెప్పి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు తీసుకురండి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -