Thursday, May 2, 2024
- Advertisement -

మ‌రో అణు యుధ్దం తప్ప‌దా… అమెరికాకు ర‌ష్యా,ఇరాన్ వార్నింగ్‌…..

- Advertisement -

అమెరికా ,ర‌ష్యా  దేశాల మ‌ధ్య మాట‌ల యుధ్దం తారాస్తాయికి చేరింది.  సిరియా స‌మ‌స్య కారనంగా  ద‌క్షిణాసియాలో మ‌రో అణుయుధ్ద మేగాలు క‌మ్ముకున్నాయి.సిరియా అధ్య‌క్షుడు అష‌ద్  సేన‌ల‌ను లక్ష్యంగా చేసుకొని తాజాగా  అమెరికాచేసిన క్షిప‌ణి దాడులు ఉద్రిక్తిక ప‌రిస్తితుల‌కు మ‌రింత ఆజ్యం  పోశాయి.మొద‌టి నుంచి సిరియాకు అండ‌గా నిలుస్తున్న ర‌ష్యా,ఇరాన్ లు తాజాగా పెద్ద‌న్న‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాయి.

సిరియా ప్ర‌భుత్వ సేన‌ల‌ను క్ష్యంగా చేసుకొని మ‌రోసారి దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమ‌ని… ప్ర‌తిచ‌ర్య‌గా సైనికి దాడులు చేస్తామ‌ని అధ్య‌క్షుడు ట్రంప్‌ని హెచ్చ‌రించాయి.సిరియా విష‌యంలో అమెరికా ల‌క్ష్మ‌ణ రేఖను దాటింద‌నీ…. ఈసారి ఉల్లంగిస్తే అమెరికా సేన‌ల‌కు ఎలా బ‌దులివ్వాలో తెలుసున‌ని ర‌ష్యా,ఇరాన్ ఆర్మీ ఛీప్‌లు ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. సిరియా విష‌యంలో ర‌ష్యాకు ఆల్టిమెట్టం ఇస్తే అణు యుద్దం త‌ప్ప‌ద‌ని ..  లండ‌న్‌లోని ర‌ష్యారాయ‌బార కార్యాల‌యం ట్విట్ట‌ర్‌లో ఘాటు వ్యాఖ్య‌లు చేసింది. గ‌త వారంలో సిరియా వైమానిక స్తావ‌రాల‌పై అమెరియా క్షిప‌ణీ దాడులు చేసింది.మ‌ధ్య‌ద‌రా స‌ముద్రంలో అమెరికా మోహ‌రించిన యూఎస్ఎస్ పోర్ట‌ర్‌,యూఎస్ఎస్ రాస్ అనే రెండు యుధ్ద‌నౌక‌ల‌నుంచి 60 వ‌ర‌కు తోమ‌హాక్ క్షిప‌నుల‌తో ప్ర‌యేగించి ఆప్రాంతాన్ని ధ్వంసం చేసింది.ఈదాడులే అమెరికా ,ర‌ష్యా మ‌ధ్య  తీవ్ర ఉద్రిక్తిత‌ల‌కు దారితీసింది. సిరియాలో రెబ‌ల్స్ అధీనంలో ఉన్న ప్రాంతంలో ర‌సాయినిక దాడి జ‌రిగి 70 మంది అమాయ‌కులు చినిపోవ‌డంతోనే ఈదాడులు చేశామ‌ని అమెరికా స‌మ‌ర్థించుకున్నా అంత‌ర్జాతీయ స‌మాజం మాత్రం దాన్ని అంత‌గా ఆమోదించ‌టంలేదు.

ఒబామా హ‌యాంలో ర‌ష్యాతో  తీవ్రంగా దెబ్బ‌తిన్న సంబంధాల‌ను మ‌రుగుప‌రుస్తామ‌నీ ట్రాంప్ చేసిన వ్యాఖ్య‌ల‌కు,చేస్తున్న ప‌నుల‌కు పొంత‌న‌కుద‌ర‌డంలేదు.స‌మీప భ‌విష్య‌త్తులో సిరియాపై మ‌రిన్ని ఆంక్ష‌లు విధిస్తామ‌నీ అమెరికా హెచ్చ‌రించింది.ఐక్య‌రాజ్య‌స‌మితిలో అమెరికా రాయ‌బారి నిక్కీహేలీ స్పందిస్తూ ర‌సాయిన దాడులు ఆప‌క‌పోతే మ‌రిన్ని సైనికి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అన్నారు.. అయితే, అసద్‌కు గట్టిగా మద్దతు ఇస్తున్న రష్యా, ఇరాన్‌.. ట్రంప్‌ సర్కారును బాహాటంగా సవాల్‌ చేస్తున్నాయి.ప్ర‌పంచంలో రెండు పెద్ద‌దేశాల మ‌ధ్య ఏర్ప‌డుతున్న ఉద్రిక్త‌త ప‌రిస్తితులు యుధ్దానికి దారి తీసేవిధంగా ఉంట‌డంతో ఎప్పుడు ఏం జ‌రుగుతుందోన‌ని ప్ర‌పంచ దేశాలు ఆందోళ‌న‌లో ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -