Wednesday, May 1, 2024
- Advertisement -

ఎస్‌బీఐ గృహ‌రుణ.. ఖాతాదారుల‌కు శుభ‌వార్త‌

- Advertisement -
sbi cuts home loan rates by 0 25 to 8 35 for loans up to rs 30 lakh

ప్ర‌భుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గ‌జం ఎస్‌బీఐ త‌మ ఖాతాదారుల‌కు గుడ్ న్యాస్ అందించింది. గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గిస్తూ ఎస్‌బీఐ నిర్ణయం తీసుకుంది. గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గిస్తూ ఎస్‌బీఐ నిర్ణయం తీసుకుంది. రూ.30లక్షలపైన ఉన్న లోన్లపై 10బేసిస్‌ పాయింట్లు, రూ.30లక్షలలోపు ఉన్న లోన్లపై 25బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్లు సోమవారం పక్రటించింది.

మే 9వ తేదీనుంచి ఈ వడ్డీరేట్లు అమల్లోకి రానున్నాయని తెలిపింది.గత నెల ఎస్‌బీఐ 9.10 బేస్‌పాయింట్ల వడ్డీరేట్లను తగ్గించింది. దీని ప్రకారం రూ.30లక్షల లోపు రుణాలపై ప్రస్తుతం ఉన్న వడ్డీరేటు 8.6 శాతం నుంచి 8.35శాతంగా ఉండనుంది. అలాగే ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (అర్బన్) పథకం కింద రుణం తీసుకునే ఖాతాదారులు కనీసం రూ. 2.67లక్షల దాకా సబ్బిడీ పొందవచ్చునని తెలిపింది. ఈ పథకం కింద మధ్య ఆదాయ వర్గాల వారు మొదటి సారి గృహ రుణ రుణగ్రహీతలు ఈ తగ్గింపును పొందవచ్చని తెలిపింది. తమ రేట్లు తగ్గింపుతో గృహ కొనుగోలుదారులకు సరసమైన ధరలో గృహాలు సొంతం చేసుకోవాలనుకునే మిలియన్ల మంది కల నెరవేరుతుందని నేషనల్ బ్యాంకింగ్ గ్రూపు మేనేజింగ్ డైరెక్టర్ రాజ్నీష్ కుమార్ చెప్పారు.

మరోవైపు ఈప్రభావం మార్కెట్‌లో షేర్‌ ధరపై చూపించింది. ఇంట్రాడేలో రూ.300మార్క్ మరోసారి టచ్ చేసిన ఎస్‌బిఐ అనంతరం రూ.294కి పతనమైంది. మళ్లీ కోలుకొని దాదాపు 2 శాతం లాభాలతో కొనసాగుతోంది. ఈ వడ్డీరేట్ల తగ్గింపు గృహనిర్మాణ రంగానికి మంచి వూపునిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం గృహరుణ మార్కెట్లో ఎస్‌బీఐ అతితక్కువ రేట్లకు రుణాలను ఇస్తున్నట్లు బ్యాంకు వర్గాలు తెలిపాయి.

Related

  1. శిల్పా వ‌ర్గానికి చెక్ పెట్టేందుకు తెర‌పైకి భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి
  2. మహిళా ఎమ్మెల్సీలకు ఆ వీడియోలు పంపిన బీజేపీ ఎమ్మెల్సీ
  3. బాబుచేయ‌లేనిది జ‌గ‌న్ చేసి చూపించారు….
  4. ట్రంప్, పుతిన్‌లు సిరియా కంటే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ తీరుపైనే ఎక్కువగా చర్చించినట్లు సమాచారం….

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -