Sunday, April 28, 2024
- Advertisement -

సంచ‌ల‌నంగా మారిన సీఎం వైఎస్ జ‌గ‌న్ భ‌ద్ర‌త‌….

- Advertisement -

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి భ‌ద్ర‌త‌ను క‌ట్టు దిట్టం చేశారు పోలీసులు . జ‌గ‌న్ ఇంటితో పాటు ప‌రిస‌ర ప్రాంతాల‌ను నిఘానీడ‌లోకి రానున్నాయి. విశాఖ‌లో జ‌గ‌న్‌పై దాడి జ‌రిగిన త‌ర్వాత భ‌ద్ర‌త‌ను మ‌రింత క‌ట్టుదిట్టం చేశారు. వైయస్ జగన్ ఇంటి వద్ద సెక్యూరిటీని టైట్ చేసింది. ఇప్పటికే సాయుధ పోలీసు బలగాలతోపాటు స్థానిక పోలీసులతో సెక్యూరిటీ ఏర్పాటు చేసింది పోలీస్ శాఖ.

జ‌గ‌న్ ఆగ‌ష్ట్ 1 నుంచి ప్ర‌జాద‌ర్బార్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మరింత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. డ్రోన్లను రంగంలోకి దించారు. వైయస్ జగన్‌ నివాసం డ్రోన్ల సాయంతో పర్యవేక్షిస్తున్నారు. మంగళగిరి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌ నుంచి పోలీసులు డ్రోన్ల ద్వారా నిఘాను పర్యవేక్షిస్తున్నారు. తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి వెళ్లే దారిలో ఉన్న స్తంభాలకు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి అక్కడికి వచ్చే వారికి కదలికలను గమనిస్తున్నారు.

ప్రజాదర్బార్‌లో సీఎం జగన్‌ను కలిసి తమ సమస్యలను తెలియజేసేందుకు వందలాది మంది ప్రజలు రానున్న నేపథ్యంలో పోలీసులు ఈ భద్రత పెంచినట్టు తెలుస్తోంది. ప్ర‌జాద‌ర్బార్‌కు వ‌చ్చే ప్ర‌త ఒక్క‌రి వివ‌రాలను సేక‌రించేందుకు పోలీసులు సిద్ద‌మ‌వుతున్నారు. ప్రజాదర్బార్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటంతో పాటు బాధితులు ఎవరూ ఆందోళనలకు దిగకుండా ఉండేందుకు పోలీసులు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

సీఎం జగన్ నివాసానికి వెళ్లే దారిలో ట్రాఫిక్ సమస్యను క్లియర్ చేయడంతోపాటు ఆందోళన కారుల నిరసన ప్రదర్శనలను ముందే తెలియజేస్తూ అప్రమత్తం చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి నివాసం వద్ద డ్రోన్లను వినియోగించడం సంచలనంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -