Wednesday, May 1, 2024
- Advertisement -

ఓటమి ఎఫెక్ట్.. సోనియానే శరణ్యమా.?

- Advertisement -

ఓటమి.. గెలుపు.. ఈ రెండూ జీవితంలో సర్వసాధారణం.. రాజకీయాల్లోనూ అంతే.. 9 నెలల్లోనే అధికారం కొల్లగొట్టిన ఎన్టీఆర్ ఆ తర్వాతి ఎన్నికల్లో ఓడిపోయారు. ఇక ఉవ్వెత్తిన ఎగిసి రెండు సార్లు కేంద్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీజేపీ చేతిలో వరుసగా రెండుసార్లు ఓడిపోయి కృంగిపోయింది.

మొన్నటి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను గెలిపించిన రాహుల్ ఈసారి హంగ్ అయినా వస్తుందని.. కాంగ్రెస్ కు మెజార్టీ సీట్లు వస్తాయని భావించారు. మిత్రపక్షాలతో అధికారంలోకి రావచ్చని ఆశించాడు. కానీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా 52 మంది ఎంపీలు మాత్రమే గెలిచారు.

లోక్ సభ సమావేశాలకు వేళయ్యింది. కాంగ్రెస్ పక్ష నేతను తేల్చాల్సి ఉంది. ఇక కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉండడానికి రాహుల్ గాంధీ ససేమిరా అని రాజీనామా చేసేశారు. రాజీనామా వెనక్కి తీసుకోవడం లేదు. దీంతో ఈ గండం నుంచి గట్టెక్కించడానికి సోనియానే దిక్కు అని పార్టీ నేతలు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.

ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి నేపథ్యంలో ఇటీవల జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగబోనని రాహుల్ గాంధీ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. దీంతో రాహుల్ అభ్యంతరం చెప్పడంతో సోనియానే పార్లమెంటరీ పక్ష నేతగా నియమించాలని పార్టీ సీనియర్ నేతలు భావిస్తున్నట్టు తెలిసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -