Thursday, May 2, 2024
- Advertisement -

చీఫ్ జ‌స్టిస్ విష‌యంలో సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు

- Advertisement -
బెంచ్‌లకు కేసుల కేటాయింపుల్లో పారదర్శకత ఉండాలంటూ దాఖలైన ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం (పిల్‌)ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధ‌వారం (ఏప్రిల్ 11) కొట్టేసింది. ఈ నేప‌థ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ విష‌యంలో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.
భారత ప్రధాన న్యాయమూర్తి అత్యున్నత అధికారం గల వ్యక్తి అని, అతడిని ఇబ్బంది పెట్టడం సరికాదు అని ధర్మాసనం పేర్కొంది. త్రిసభ్య ధర్మాసనంలో జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎం ఖాన్ విల్కర్ ఉన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ తీర్పును చదువుతూ.. ప్రధాన న్యాయమూర్తికి సర్వోన్నత అధికారాలు ఉన్నాయని,  బెంచ్‌లకు  కేసులను కేటాయించాలన్న విశిష్ట అధికారాలను రాజ్యాంగమే ఆయనకు కల్పించిందని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు రోస్టర్‌ను వేయడంలో పూర్తి అధికారాలు చీఫ్ జస్టిస్‌కే ఉన్నాయని చెప్పారు.
చీఫ్ జస్టిస్ తన అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారంటూ 2008 జనవరిలో నలుగురు సీనియర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆరోపణలు చేసిన తర్వాత అశోక్ పాండే అనే వ్యక్తి ఆ అంశంపై పిల్ దాఖలు చేశాడు. ఈ పిల్ చివ‌రికి సుప్రీంకోర్టు కొట్టేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -