Sunday, April 28, 2024
- Advertisement -

సుప్రీం నిర్ణయం తో రాజకీయ నాయకులలో వణుకు పుడుతుందా..?

- Advertisement -

గత కొన్ని రోజులుగా ఎంతో ఆసక్తి కనపడుతున్న ప్రజాప్రతినిధుల నేర చరిత్ర వ్యవహరం ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తుంది. నేరాలకు పాల్పడిన ప్రజాప్రతినిధులను ఎరిపారేయాలన్న లక్ష్యం తో సుప్రీం కోర్టు వేసిన ఈ అడుగు మునుముందుకు సాగేందుకు సిద్ధం అవుతుంది.. అమికస్ క్యూరీ చురుగ్గా వ్యవహరించడంతో అన్ని రాష్ట్రాల హై కోర్టు ల నుంచి ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికను అమికస్ క్యూరీ విజయ్ హన్సరియ సేకరించి సుప్రీం కోర్టు కు సమర్పించారు. దేశవ్యాప్తంగా దాదాపు 4859 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఏపీలో ప్రజాప్రతినిధులపై 132 కేసులు, తెలంగాణలో ప్రజాప్రతినిధులపై 143 కేసులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపింది.

హైదరాబాద్ సిబిఐ ప్రధాన కోర్టులో ఉన్న 17 కేసుల విచారణ ను 9  నెలల్లో ముగించే అవకాశం ఉందని తెలంగాణా హై కోర్టు సమాచారం ఇచ్చింది. మరో 11 కేసుల్లో సిబిఐ, ఐదు కేసుల్లో ఈడీ చార్జ్ షీట్ ఫైల్ చేసిందని ప్రజాప్రతినిధులపై పెండింగ్ లో ఉన్న కేసులు ప్రతి శనివారం విచారణ జరపాలని తెలంగాణా హై కోర్టు నిర్ణయించినట్లు గా తెలిపింది. ప్రజా ప్రతినితులపై ఉన్న కేసుల విచారణ, పురోగతి తెలుసుకునేందుకు ప్రత్యేక వెబ్ సైట్ ఏర్పాటుకు తెలంగాణా హై కోర్టు నిర్ణయించింది. ఈ విషయంలో తెలంగాణా హై కోర్టు ను ఆదర్శంగా తీసుకుని మిగిలిన రాష్ట్రాల హై కోర్టు లు వెబ్ సైట్ రూపిందిస్తే బాగుంటుందని అమికస్ క్యూరి సుప్రీంకోర్టుకు సూచించారు. ఏపీ హైకోర్టు కూడా ప్రతి జిల్లాలో ఒక మెజిస్ట్రేట్ కోర్టుని ప్రత్యేక కోర్టు గుర్తిస్తామని తెలిపింది. విశాఖ, కడపలో సెషన్స్ స్థాయి ప్రత్యేక కోర్టుల ఏర్పాటు చేస్తామని.. ప్రాధాన్యత క్రమంలో విచారించాలా లేక సాధారణంగానే విచారించాలా.. అన్న అంశంపై స్పష్టత ఇవ్వాలని సుప్రీంని ఏపీ హైకోర్టు కోరింది.

సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికలో అమికాస్ క్యురీ కీలకమైన సిఫారసులు చేశారు సిబిఐ, ఈడీ, ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థల్లోని కేసుల పురోగతి పై నివేదిక సమర్పించేలా కేంద్రాన్ని ఆదేశించాలని సూచించారు. ఎంపీ , ఎమెల్యేల కేసుల విచారణ తో పాటు దర్యాప్తు ను కూడా హై కోర్టు పర్యవేక్షించాలని సాక్ష్యుల రక్షణ కోసం సుప్రీం గతంలో చెప్పిన సాక్సుల సరంక్షణ చట్టం 2018 ని అన్ని ప్రత్యేక కోర్టులు అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. మంగళవారం ఈ అంశంపై సుప్రీం కోర్టులో కీలకమైన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

తొమ్మిది నెలల్లో మొత్త ఏరిపారేస్తారట.. టెన్షన్ లో రాజకీయ నేతలు..?

వైఎస్సారా మజాకా.. ఇంకా తలుచుకుంటున్న జనం…?

అక్కడ ఒక్క గొర్రె ధర అక్షరాలా మూడు కోట్లు.. ఎక్కడంటే..?

ఈనెలలో 14 రోజులు బ్యాంకులు ఉండవు.. ఎందుకంటే..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -