Tuesday, May 7, 2024
- Advertisement -

స‌ర్జిక‌ల్ దాడుల‌కు చిరుత మూత్రం ఎందుకు తీసుకెల్లారంటే..?

- Advertisement -

యూరీ సెక్టార్లో సైనిక స్థావరంపై ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా.. భారత సైన్యం సర్జికల్ స్ట్రయిక్స్ చేపట్టిన సంగతి తెలిసిందే. 2016, సెప్టెంబర్ 28వ తేదీ రాత్రి ఆ దాడి జరిగింది. దీనికి సంబంధించిన సంబంధించిన అనేక అంశాలు ఇంకా బయటకు రాలేదు. క్లిష్టమైన ఈ ఆపరేషన్ కోసం సైన్యం అన్ని రకాలుగా సన్నద్ధమైంది. అయితే ఓ సీనియర్ ఆఫీసర్ ఇవాళ ఆ ఆపరేషన్‌కు సంబంధించిన ఓ విషయాన్ని వెల్లడించారు.

రాత్రి పూట సైనికుల సంచారాన్ని కుక్కలు పసిగడితే మొరిగే ప్రమాదం ఉంది. దీన్ని ముందే ఊహించిన సైనికబలగాలు విరుగుడుగా చిరుతల మల మూత్రాలను ఉపయోగించాయి. ఈ విషయాన్ని నగ్రోటా కార్ప్స్ మాజీ కమాండర్, లెఫ్టినెంట్ జనరల్ రాజేంద్ర నింబోర్కర్ వెల్లడించారు

సర్జికల్ దాడికి వెళ్లిన భారతీయ జవాన్లు తమ వెంట చిరుత మూత్రాన్ని కూడా తీసుకువెళ్లారట. నౌషెరా సెక్టార్లో బ్రిగేడ్ కమాండర్‌గా పని చేసిన సందర్భంలో తనకు ఎదురైన అనుభవాలను నింబోర్కర్ సర్జికల్ దాడులకు ఉపయోగించుకున్నారు. ‘నౌషెరా ప్రాంతంలో చిరుతలు కుక్కల మీద దాడి చేసేవి. దీంతో కుక్కలు ప్రాణ భయంతో రాత్రి పూట ఇళ్ల దగ్గరే ఉండవని నింబోర్కర్ తెలిపారు.

సాధారణంగా రాత్రి పూట ఊళ్లల్లో కుక్కలు మొరుగుతుంటాయని, కానీ అవి చిరుతలంటే భయపడుతాయని, అందుకే అవి అరవకుండా ఉండేందుకు సైనికులు తమ వెంట చిరుత మూత్రాన్ని తీసుకువెళ్లారని, ఆ మూత్ర వాసన వల్ల కుక్కలు బెదురుతాయని, అవి ముందుకు రావు అని ఆయన అన్నారు. అలా చిరుతల మల మూత్రాలను కూడా ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రయిక్స్‌కు ఉపయోగించిందన్నమాట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -