Tuesday, May 7, 2024
- Advertisement -

తెలుగు ప్ర‌జ‌ల మ‌ధ్య ఖడ్గచాలనం కాదు..ఇక కరచాలనమే…కేసీఆర్‌

- Advertisement -

కొద్ది క్ష‌ణాల క్రిత‌మే అద్భుత గట్టం ముగిసింది. నవ్యాంధ్ర ప్ర‌దేశ్ సీఎంగా వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేత గ‌వ‌ర్న‌ర్ న‌ర‌శింహ‌న్ ప్ర‌మాణ స్వీకారం చేయించారు. ఈ కార్య‌క్ర‌మానికి తెలంగాణా సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, డీఎమ్‌కే అధినేత స్టాలిన్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఈ సంర్భంగా కేసీఆర్ ప్ర‌సంగించారు.

జగన్ ప్రమాణస్వీకారానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన సభావేదికపై మాట్లాడుతూ… తెలంగాణ ప్రజల పక్షాన వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. జ‌గ‌న్ వ‌య‌స్సు చిన్న‌ది కాని బాధ్య‌త పెద్ద‌ద‌ని త‌న క‌ర్త‌వ్యాన్ని గుర్తు చేశారు. సీఎంగా బాధ్య‌త‌ల‌ను అద్భుతంగా నిర్వహించే ధైర్యం, శక్తి, స్థైర్యం, సామర్థ్యం ఉందని తొమ్మిదేళ్లలో జగన్ నిరూపించుకున్నారు.

వయస్సు చిన్నదైనా తండ్రి నుంచి వచ్చిన వారసత్వం జగన్‌ను ముందుకు నడిపిస్తుందని ఆశీస్తున్నట్టు తెలిపారు. కృష్ణా, గోదావ‌రి జ‌లాల‌ను రెండుతెలుగు రాష్ట్రాలు స‌మ‌ర్థ వంతంగా వినియోగించుకొనే విధంగా రెండు రాష్ట్రాలు క‌ల‌సి ప‌నిచేస్తాయ‌న్నారు. రెండు రాష్ట్రాల్లోని ప్రతి అడుగు భూమినీ సస్యశ్యామలం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ మార్గంలో అన్నివిధాలైన సహకారాన్ని తాము అందిస్తామని చెప్పారు.

రాష్ట్రాల్లో, దేశంలో, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలంతా ప్రేమతో, అనురాగంతో, పరస్పర సహకారంతో ముందుకు సాగడానికి ఈ ఘట్టం బీజం వేస్తుందని తాను నమ్ముతున్నట్టు తెలిపారు.ఇక రెండు రాష్ట్రాలూ ఖడ్గచాలనం వదిలేసి కరచాలనం చేసే రోజు ఇదని, తనకు తెలిసి జగన్ ముందున్న కర్తవ్యం గోదావరి జలాల సంపూర్ణ వినియోగమని, అది 100 శాతం జరుగుతుందన్న నమ్మకం ఉందని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -