Thursday, May 2, 2024
- Advertisement -

తెలంగాణ హైకోర్టు సీజేగా రాధాకృష్ణన్‌ ప్రమాణం ..

- Advertisement -

ఎన్నోఏళ్లుగా ఉన్న తెలంగాణ వాసుల చిరకాల ఆకాంక్ష నెరవేరింది. కొత్త సంవ‌త్స‌రం ప్రత్యేక హైకోర్టు కొలువుదీరింది. జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌ తెలంగాణ హైకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. రాజ్‌భవన్‌లో రాధాకృష్ణన్‌తో గవర్నర్‌ నరసింహన్‌ ఈరోజు ఉదయం ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరయ్యారు. మిగిలిన న్యాయ‌మూర్తుల చేత జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్ ప్ర‌మాణ స్వీకారం చేయించారు.

కేరళలోని కొల్లాంలో 1959, ఏప్రిల్‌ 29న రాధాకృష్ణన్ జన్మించారు. అక్కడే పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశారు. కర్ణాటకలోని కొలార్‌ గోల్డ్‌ ఫీల్డ్‌ లా కాలేజీ నుంచి లాయర్‌ పట్టా సాధించారు. తిరువనంతపురంలో 1983లో న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు. గతేడాది మార్చి 18న ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది జూలైలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. హైకోర్టు విభ‌జ‌న‌కు కేంద్రం ప‌చ్చ‌జెండా ఊప‌డంతో చీఫ్‌ జస్టిస్‌గా రాధాకృష్ణన్‌ను కొనసాగిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్న స‌మ‌తి తెలిసిందే.

ప్రమాణస్వీకారం చేసిన న్యాయమూర్తులు వీరే:

జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్
జస్టిస్ రామ సుబ్రమణ్యన్
జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్ కుమార్
జస్టిస్ సత్యరత్న శ్రీరామచంద్ర రావు
జస్టిస్ అడవల్లి రాజశేఖర్ రెడ్డి
జస్టిస్ పొనుగంటి నవీన్ రావు
జస్టిస్ చల్లా కోదండరాం చౌదరి
జస్టిస్ బొలుసు శివశంకర్ రావు
జస్టిస్ డాక్టర్ షమీన్ అక్తర్
జస్టిస్ పొట్లపల్లి కేశవరావు
జస్టిస్ అభినంద్ కుమార్ షావలి
జస్టిస్ తొడుపునూరి అమర్ నాథ్ గౌడ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -