Monday, May 6, 2024
- Advertisement -

అబుదాబిలో తొలిసారిగా రూపుదిద్దుకుంటోన్న హిందూ ఆలయం..!

- Advertisement -

యూఏఈలో నిర్మించనున్న తొలి హిందూ దేవాలయ నమూనాను ఆలయ నిర్వాహకులు విడుదల చేశారు. భారతీయ ఇతిహాసాలు, పురాణాలు, గ్రంథాలు, పురాతన గాధలతో ఆలయ గోడలు అలరారనున్నాయని నిర్వాహకులు తెలిపారు.  మన దేశ తరహాలోనే చేతితో చెక్కిన రాతి స్తంభాలను ఉపయోగిస్తున్నారు. ఈ మేరకు సంబంధిత దృశ్యాలను విడుదల చేశారు బోచాసాన్వి శ్రీ అక్షర్​ పురుషోత్తమ్​ స్వామినారాయణ్​ సంస్థాన్(బీఏపీఎస్​)​ అధికార ప్రతినిధి అశోక్​ కొటెచా.

ఈ ఆలయ నిర్మాణం కోసం రాజస్థాన్, గుజరాత్​లలో తయారైన ప్రత్యేక శిలలను ఉపయోగిస్తున్నారు. ఆలయ వెలుపలి భాగంలో గ్రంథాలయం, తరగతి గది, సమావేశ భవనాలను నిర్మించనున్నారు.ప్రవేశ ద్వారంలో ఏర్పాటు చేసిన జలపాతం, ఆలయం చుట్టూ ప్రత్యేకంగా రూపొందించిన నీటి వనరుల దృశ్యాలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

చారిత్రాత్మకమైన ఈ ఆలయం.. భారత్​, యూఏఈల మార్గనిర్దేశం ప్రకారం నిర్మిస్తున్నారు అధికారులు. ఈ హిందూ పుణ్యక్షేత్రం కోసం గతేడాది ఏప్రిల్​లో పునాదులు పడగా.. అదే సంవత్సరం డిసెంబర్​ నుంచి నిర్మాణ పనులు ప్రారంభించారు. మందిరానికి సంబంధించిన మాస్టర్​ ప్లాన్​ రూపకల్పన ఈ ఏడాది ఆరంభంలోనే పూర్తయింది. అయితే.. కరోనా మహమ్మారి కారణంగా నిర్మాణ పనులు మరింత ఆలస్యమవుతున్నాయి.

మాంసం తిని.. గుడికి వెళ్ళొచ్చా.. వెళ్తే ఏమవుతుందో తెలుసా..?

హారతి సమయంలో ఈ గుళ్లో దేవుడు కళ్లు తెరుస్తాడని తెలుసా?

మన హీరోలు వాడే కార్లు వాటి ఖరీదు ఎంతంటే ?

గుండె కోసం ఈ పది సూపర్ ఫుడ్స్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -