Monday, April 29, 2024
- Advertisement -

యోంగ్చువాన్ బొగ్గు గనిలో ఘోర ప్రమాదం..!

- Advertisement -

చైనాలోని యోంగ్​చువాన్​ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చాంగ్​కింగ్​ మున్సిపాలిటీ పరిధిలోని డియోషుయిడాంగ్​ బొగ్గు గనిలో చిక్కుకుని 18 మంది ప్రాణాలు కోల్పోయారు. వారంతా మైనర్లు కావటం గమనార్హం. మరో ఐదుగురు గనిలోనే చిక్కుకుపోయినట్లు సమాచారం. కార్బన్​ మోనాక్సైడ్​ స్థాయి పరిమితి మించి పెరిగిపోవటం వల్లే ప్రాణ నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు.

గని లోపల మండుతున్న బొగ్గుతో కార్బన్ మోనాక్సైడ్ స్థాయిలు భద్రతా పరిమితిని మించి పోయాయని, 23 మంది అందులోనే చిక్కుకుపోవటం వల్ల ప్రమాదం జరిగినట్లు చైనా అధికారిక మీడియా జిన్హువా వెల్లడించింది.

రెస్క్యూ బృందాలు, పోలీసులు, అగ్నిమాపక దళాలు.. గనిలో చిక్కుకున్న మైనర్లను వెలికితీసేందుకు ప్రయత్నాలు చేపట్టాయి. అయితే.. ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -