Thursday, May 2, 2024
- Advertisement -

ద్వీపకల్పంలో ఘోర ప్రమాదం..పెట్రోలింగ్ సిబ్బంది పై బాంబు..!

- Advertisement -

ఈజిప్టులోని సునాయ్​ ద్వీపకల్పంలో ఘోర ప్రమాదం జరిగింది. పెట్రోలింగ్​ నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది వాహనం.. రోడ్డుపై పడిఉన్న బాంబును ఢీకొట్టడంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు భద్రతా సిబ్బంది మృతి చెందారు. ఐదుగురు గాయపడ్డారు.

గత మూడు రోజుల్లో శుక్రవారం జరిగిన బాంబు ప్రమాదం రెండోది. ఈ దాడి వెనుక ఎవరున్నారన్నది మాత్రం కచ్చితంగా తెలియదు. కానీ గతంలో జరిగిన దాడి తామే చేశామని ఇస్లామిక్​ స్టేట్​ గ్రూప్స్​ ప్రకటించాయి. గజా సరిహద్దుల్లో జరిగిన బాంబు పేలుడులో ఒక భద్రతా సిబ్బంది మరణించారు.

సునాయ్​ ద్వీపకల్పంలో ఇస్లామిక్​ అంతర్గత తిరుగుబాటుతో ఈజిప్టు అట్టుడుకుతోంది. ఇస్లామిక్​ అధ్యక్షుడు మహమ్మద్​ మోర్సీని 2013లో మిలిటరీ దళాలు గద్దె దించిన తర్వాత దాడులు మరీ అధికం అయ్యాయి. భద్రతా దళాలు, క్రిష్టియన్​ మైనారిటీ వర్గాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరుగుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -