Tuesday, May 7, 2024
- Advertisement -

516 కి.మీ.లు ఏడు గంట‌ల్లో … అంబులెన్స్ డ్రైవ‌ర్ సాహసం…

- Advertisement -

అతడో సాధారణ డ్రైవర్‌. అత‌నేమి రేస్ డ్రైవ‌ర్ కాదు. నెల‌వ‌య‌సున్న ప‌సిపాప ప్రాణం కాపాడ‌టంకోసం సాహసానికి పూనుకున్నాడు. అత‌ని ముందు ఒకే ఒక్క‌టి ఆలోచ‌న ఏదంటె పాప‌ను ఎలాగైనా కాపాడాల‌నె త‌ప‌న‌. 31 రోజుల వ‌య‌సున్న పాపకు హార్ట్ స‌ర్జ‌రీ చేయించ‌డం కోసం క‌న్నూర్ నుంచి తిరువ‌నంత‌పురం వ‌ర‌కు ఉన్న 516 కి.మీ.ల దూరాన్ని కేవ‌లం 7 గంట‌ల్లో చేరుకుని ఔరా అనిపించాడు కేర‌ళ‌కు చెందిన డ్రైవ‌ర్ తమీమ్‌. 14 గంటలు పట్టే ప్రయాణాన్ని సగం సమయంలోనే పూర్తి చేశాడు. అతి తక్కువ సమయంలో చిన్నారిని ఆస్పత్రికి తరలించి ఆమె ప్రాణాలు నిలిపేందుకు తన వంతు ప్రయత్నం చేశాడు.

కేరళలోని తీర పట్టణం కాసార్‌గాడ్‌ పట్టణానికి చెందిన తమీమ్‌.. కన్నూరులోని పరియారామ్‌ మెడికల్‌ కాలేజీలో అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం ఆస్పత్రి వర్గాలు అతడికి బృహత్తరమైన కార్యాన్ని అప్పగించాయి. 31 రోజుల పసిపాప ఫాతిమా లాబియాను వీలైనంత తొందరగా అంబులెన్స్‌లో తిరువనంతపురంలోని శ్రీ చిత్ర మిషన్‌ ఆస్పత్రికి తరలించాలని అతడికి సూచించాయి. అంతే ఇంకేముంది స్టీరింగ్‌ ప‌ట్టాడు.

ముందు పాప ఫాతిమా లాబియాను విమానం ద్వారా పంపించాల‌ని క‌న్నూర్‌లోని ప‌రియారం మెడిక‌ల్ కాలేజీ, ఆసుప‌త్రి యాజ‌మాన్యం అనుకున్నాయి. కానీ విమాన అంబులెన్స్ సిద్ధం చేయ‌డానికే చాలా స‌మ‌యం ప‌డుతుంద‌ని తెలిసి రోడ్డుమార్గాన పంపించాల‌ని నిశ్చ‌యించుకున్నాయి.

బుధవారం రాత్రి 8.23 గంటలకు తమీమ్‌ ప్రయాణం మొదలు పెట్టాడు. స్వచ్ఛంద సంస్థ బాలల రక్షణ బృందం(సీపీటీ) సహకారంతో జర్నీ ప్రారంభమైంది. సోషల్ మీడియా ద్వారా ఈ వార్త క్షణాల్లో అందరికీ తెలిసింది. అంబులెన్స్‌ కూత వినబడగానే ప్రజలందరూ స్వచ్ఛందంగా పక్కకు తప్పుకుని దారిచ్చారు. ప్ర‌యాణంలో కేర‌ళ పోలీసులు, చైల్డ్ ప్రొటెక్ష‌న్ టీమ్ కేర‌ళ స్వ‌చ్ఛంద సంస్థ స‌భ్యులు రోడ్డు మీద ట్రాఫిక్ క్లియ‌ర్ చేసి, మార్గాన్ని సుగ‌మం చేయ‌డంలో స‌హాయ‌ప‌డ్డారు.

స‌రైన స‌మ‌యానికి తిరువ‌నంత‌పురంలోని శ్రీ చిత్ర మిష‌న్ ఆసుప‌త్రికి చేరుకున్నప్ప‌టికీ పాప ప‌రిస్థితి ఇంకా విష‌మంగానే ఉన్న‌ట్లు డాక్ట‌ర్లు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -