Sunday, April 28, 2024
- Advertisement -

టైమ్స్ గ్రూప్ చైర్మన్ కన్నుమూత!

- Advertisement -

టైమ్స్‌ గ్రూప్‌ చైర్‌పర్సన్‌ ఇందూ జైన్‌(84)ను కరోనా మహమ్మరి కారణంగా కన్నుమూశారు. కరోనా మహమ్మరి బలితీసుకుంది. కోవిడ్ సంబంధిత సమస్యల కారణంగా ఆమె గురువారం కన్నుమూశారు. 1999లో టైమ్స్ గ్రూప్‌ యాజమాన్య బాధ్యతలు చేపట్టి సంస్థ స్థాయిని పెంచడానికి ఇందూ జైన్ ఎంతో కృషి చేశారు. 2000లో టైమ్స్‌ ఫౌండేషన్‌ను స్థాపించి సేవా కార్యక్రమాల్లో దేశంలోనే ఉత్తమ ఎన్‌జీవోగా తీర్చిదిద్దారు.

టైమ్స్ ఫౌండేషన్ ద్వారా వరదలు, తుఫానులు, భూకంపాల సమయంలో సేవలు అందించి ఉత్తమ ఎన్‌జీవోగా పేరు తెచ్చుకుని, పారిశ్రామిక రంగంలో ఎదిగారు. 1983లో ఏర్పాటైన ఫిక్కి లేడీస్‌ ఆర్గనైజేషన్‌(ఎఫ్‌ఎల్‌వో)కు వ్యవస్థాపక అధ్యక్షురాలిగా వ్యవహరించిన ఇందూ.. భారతీయ భాషా సాహిత్యాభివృద్ధిని కాంక్షిస్తూ తన మామ సాహు శాంతి ప్రసాద్‌ జైన్‌ స్థాపించిన భారతీయ జ్ఞాన్‌పీఠ్ ట్రస్ట్‌కు 1999 నుంచి చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు.

ఈ ట్రస్ట్‌ ఏటా జ్ఞానపీఠ్ అవార్డులను అందజేస్తూ ఉంటుంది. 2016లో ఆమె పద్మభూషణ్ అందుకున్నారు. ఇందూ జైన్ మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త అశోక్ కుమార్ జైన్‌ను వివాహం జరిగింది. సమీర్ జైన్, వినీత్ జైన్ సంతానం. ఆమె భర్త అశోక్ కుమార్ జైన్ గుండె సంబంధిత సమస్యలతో 1999లో అమెరికాలో మరణించారు.

తన శరీరాకృతి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రియాంక చోప్రా

కొవిడ్ బాధితులను ఆదుకునేందుకు కదిలిన సినీ తారలు..

ముస్లిం సోదర సోదరీమణులకు బాలయ్య శుభాకాంక్షలు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -