Monday, April 29, 2024
- Advertisement -

శుభ‌లేఖ‌పై ట్రాఫిక్ రూల్స్‌.. మ‌హిళా ఎస్సై ఆద‌ర్శ నిర్ణ‌యం

- Advertisement -

రాజ‌స్థాన్ ఎస్సై పెళ్లికార్డుపై రోడ్డు భ‌ద్ర‌తా నియ‌మాలు

శుభ‌లేఖ‌ను సామాజిక అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఓ మ‌హిళా ఎస్సై వినియోగించుకుంది. చేసేదే పోలీస్ ఉద్యోగం.. మ‌రీ న‌లుగురికి ఆద‌ర్శంగా నిలిచేలా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్న ఎస్సై త‌న పెళ్లి కార్డుపై ట్రాఫిక్ రూల్స్ ముద్రించింది. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘ‌న‌పై అవ‌గాహ‌న క‌ల్పించి ఆద‌ర్శంగా నిలిచింది.
 
రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌నకు చెందిన మంజు మహిళా పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్. మంజు వివాహం ఏప్రిల్ 19వ తేదీన జ‌రగనుంది. ఈ సందర్భంగా ఆమె త‌న పెళ్లికి ఆహ్వానిస్తూ ముద్రించిన శుభ‌లేఖ‌ల‌పై ఆస‌క్తిక‌రంగా ట్రాఫిక్ రూల్స్ ముద్రించింది. ఈ ప‌త్రిక‌ల‌ను చూసి అంద‌రూ ఆమెను అభినందిస్తున్నారు.
 
ఈ సంద‌ర్భంగా మంజు మాట్లాడుతూ.. చాలామంది యువకులు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడాన్ని నేను గమనించా. ఫలితంగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అందుకే నా విధి నిర్వ‌హ‌ణ‌లో నిబద్ధతతో చేస్తున్నా. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారికి, వాటిపై అవగాహన కల్పిస్తుంటా. దీనిలో భాగంగానే నా పెళ్లి కార్డులో కూడా ట్రాఫిక్ రూల్స్ ముద్రింపజేశాను’ అని మంజు తెలిపింది.
 
అయితే మంజు తండ్రి కూడా కానిస్టేబుల్‌గా పనిచేశారు. తండ్రి,  సోదరుడు కూడా ఒక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో త‌న‌లాగ ఎవ‌రూ కాకూడ‌ద‌ని మంజూ ఈ నిర్ణ‌యం తీసుకుంది. త‌ల్లి, సోద‌రుడు లేక‌పోయినా తల్లి రాకేశ్ దేవి కోరిక మేరకు చదువుకుని మంజు ఇప్పుడు ఎస్సైగా ప‌ని చేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -