Monday, April 29, 2024
- Advertisement -

రేపటి నుంచి టీకా పంపిణీ.. షరతులు లేకుండా..!

- Advertisement -

కరోనాతో విలవిల లాడుతున్న అమెరికాకు శుభవార్త చెప్పారు అక్కడి అధికారులు. సోమవారం నుంచి కొవిడ్​కు సంబంధించిన ఫైజర్​ వ్యాక్సిన్​ను దేశవ్యాప్తంగా పంపిణీ చేయనున్నారు. ఇందుకు ప్రముఖ బట్వాడా కంపెనీలు అయిన యూపీఎస్, ఫెడెక్స్​ల ద్వారా టీకా పంపిణీ చేస్తామని ఆర్మీ జనరల్ గుస్టావ్ ఎఫ్. పెర్నా శనివారం తెలిపారు.

టీకా పంపిణీ కార్యక్రమంలో భాగంగా ట్రంప్​ సర్కార్​ సోమవారం ఉదయం అందరికీ టీకా ఇవ్వనుంది. అందుకు తగ్గట్టుగా ఆరోగ్యశాఖ కార్యకర్తలు డోసులు ఇవ్వడం ప్రారంభిస్తారని పెర్నా చెప్పారు. మంగళ, బుధవారం మరో 450 ప్రాంతాలకు టీకా అందుబాటులోకి రానుందని స్పష్టం చేశారు.

అమెరికాలో వైరస్​ ఉద్ధృతి ఏమాత్రం తగ్గడం లేదు. కొత్తగా 2లక్షల 20వేల 298 మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. దీంతో కేసుల సంఖ్య కోటీ 65లక్షలు దాటింది. మహమ్మారి ధాటికి మరో 2,309 మంది బలవ్వగా.. మొత్తం మృతుల సంఖ్య 3లక్షల 5వేలకు పెరిగింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -