Wednesday, May 8, 2024
- Advertisement -

అమెరికా ఇంట‌లిజెన్సీ హెచ్చ‌రికి.. ఇవాంకాకు మ‌రింత సెక్యూరిటీ పెంచిన టీ ప్ర‌భుత్వం…

- Advertisement -

హైదారాబాద్‌లో జరుగుతున్న గ్లోబెల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సమావేశానికి ఐసిస్ ఉగ్ర‌వాదుల ముప్పు పొంచి ఉంద‌ని ఆమెరికా ఇంట‌లిజెన్సీ హెచ్చారించింది. దీంతో ఇవాంకాకు, జీఈఎస్‌కు భ‌ద్ర‌త‌ను మ‌రింత క‌ట్టుదిట్టం చేసింది తెలంగాణా ప్ర‌భుత్వం,.

ఈ స‌ద‌స్సుకు ప్ర‌ధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంక ట్రంప్‌ కుమార్తె ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఇవాంక ట్రంప్‌ పాల్గొనే ఈ సమాశాన్ని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుంటారనే ఖచ్చితమైన సమాచారం తమ వద్ద ఉందని అమెరికా నిఘా వర్గాలు స్పష్టం చేశాయి.

ఐఎస్ ముప్పు వుందని అమెరికా సీక్రెట్ సర్వీస్ హెచ్చరించడంతో నగరంలో ఐఎస్ఐఎస్ సానుభూతిపరులన్న అనుమానం ఉన్న 200 మందిపై తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ ప్రత్యేక నిఘా పెట్టింది. స‌ద‌స్సుకు ఇప్ప‌టికే తెలంగాణా ప్ర‌భుత్వం 10,400 మంది పోలీసులను తెలంగాణ సర్కారు మోహరించగా, 8 మంది యూఎస్ సీక్రెట్ సర్వీస్ అధికారులు అనుక్షణం ఇవాంక చుట్టూ పహారా కాస్తున్నారు. మొత్తం ఐదంచెల భద్రతా ఇవాంకాకు పహారా కాయనుంది.

మ‌రో వైపు ఇజ్రాయిల్‌కు చెందిన ర‌క్ష‌ణ ప‌రిక‌రాల‌ను రంగంలోకి దింపారు. విధ్వంసాలను పసిగట్టే, యాంటీ ఎక్స్ ప్లోజివ్ ప్రత్యేక పరికరాలను అటు సదస్సు జరిగే హెచ్ఐసీసీ వద్ద, ఇటు ఫలక్ నుమా, ట్రైడెంట్ హోటల్స్ వద్ద ఉంచారు. క్లోజ్డ్ ప్రొటెక్షన్ టీమ్ పహారా నడుమ బుల్లెట్ ఫ్రూఫ్ కారులో ఇవాంకా రాకపోకలు సాగనున్నప్పటికీ.. ముందస్తు జాగ్రత్తగా మరిన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -