Thursday, May 2, 2024
- Advertisement -

జనతా కర్ఫ్యూ పాటించి.. మన భవిష్యత్తును కాపాడుకుందాం..!

- Advertisement -

కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ‘సంకల్పం, నిగ్రహం’ అవసరం అని తెలిపిన విషయం తెలిసిందే. ఈ నెల 22 (ఆదివారం) దేశవ్యాప్తంగా ప్రజలందరూ జనతా కర్ఫ్యూ పేరుతో ‘స్వీయ నిర్బంధం’ విధించుకోవాలని కోరారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలంతా ఇండ్లకే పరిమితం కావాలని కోరారు. అత్యవసర సిబ్బంది మాత్రం మినహాయింపు ఇచ్చారు. కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు భారతీయులు రెడీగా ఉన్నారో లేదో తెలుసుకొనేందుకు ఇదో పరీక్ష అన్నారు. ఈ అనుభవం దేశానికి ఎంతో మేలుచేస్తుందన్నారు.

ఇక ఈ జనతా కర్ఫ్యూ ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. కరోనా వైరస్ జనసమర్ద ప్రదేశాల్లో 12 గంటలు బ్రతకగలదు. ఈ వైరస్ ఉన్న స్థలాల్లో ఉండటం వల్ల ఇది ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. ఈ 12 గంటలు జనం గుప్పులుగా ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా ఉంటే వైరస్ 12 గంటలు తర్వాత చనిపోతుంది. అందుకే దేశమంతా 12 గంటల పాటు ఇంట్లోనే ఉండగలిగితే పబ్లిక్ ప్లేసుల్లోని వైరస్ మరణించి దాని వ్యాప్తిని తగ్గించవచ్చు. తప్పని పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే ఉదయం 7 గంటలలోపు అదేవిధంగా రాత్రి 9 గంటల తర్వాత వెళ్ళవచ్చు.

ఇలా 12 గంటలు పబ్లిక్ ప్లేసుల్లోకి వెళ్లకుండా ఉంటే ఈ వైరస్ ను దాదాపుగా నిర్మూలించగలం. అందుకే 14 గంటల జనతా కర్ఫ్యూ ప్లాన్ చేయబడింది. ఏ రసాయనాలు పబ్లిక్ ప్లేసుల్లో పిచికారి చేయక్కర్లేదు, తుడవక్కర్లేదు… 14 గంటలు వదిలేస్తే దానంతట అదే మరణిస్తుంది. అందరూ సహకరిస్తే మనల్ని, మన కుటుంబాలను, మన సమాజాన్ని, మన దేశాన్ని కాపాడుకోగలం. ఈ ఆదివారం ఎలాంటి పనులు పెట్టుకోకండి. అత్యవసర వస్తువులు, మందులు, ఇతర ఏ అవసరం ఉన్న ఈ రోజే తెచ్చిపెట్టుకోండి. మరి ముఖ్యంగా ఆదివారం అయిపోయింది కదా.. ఇక జాలిగా తిరుగొచ్చు అని అనుకోకండి.. పరిస్థితులు ఏటు మారుతాయో తెలియదు.. ఓ రెండు రోజులు ఇంట్లోనే గడిపితే ఇంకా బేటర్. ఇది మన భవిష్యత్తు కోసమే. కాబట్టి మనమందరం సహకరిద్దాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -