Saturday, April 27, 2024
- Advertisement -

వాట్సాప్ మరో సంచలనం.. అదిరిపోయే ఫీచర్

- Advertisement -

వాట్సాప్.. దాదాపు ప్రపంచవ్యాప్తంగా 1.4 బిలియన్ల మంది వాడుతున్న అతిపెద్ద సోషల్ మెసేజింగ్ సోషల్ మీడియా యాప్. అయితే రాను రాను పోటీ తీవ్రమవుతున్న నేపథ్యంలో సంస్కరణల బాట పట్టింది. టెలిగ్రామ్, సిగ్నల్, స్పాప్ చాట్ తదితర పోటీయాప్ లు వినియోగదారులకు మరిన్ని సేవలు విస్తరిస్తుండడంతో వాట్సాప్ కూడా ఇప్పుడు సరికొత్త ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకోవడానికి రెడీ అయ్యింది.

తాజాగా వాట్సాప్ మాతృసంస్థ ఫేస్ బుక్ దీన్ని డెస్క్ టాప్ కూడా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు సరికొత్త ఫీచర్లతో బీటా వెర్షన్ ను ప్రయోగాలు చేస్తోంది. డెస్క్ టాప్, పీసీల్లో వాడేలా ఫోన్ తో కనెక్ట్ లేకుండానే లాగిన్ అయ్యాలని తీర్చిదిద్దుతోంది.

ఇన్నాళ్లు డెస్క్ టాప్ వాట్సప్ ఆన్ లో ఉండాలంటే ఫోన్ లోనూ ఇంటర్నెట్ ఉండాలి. దాంతోపాటు క్యూఆర్ కోడ్ తో స్కాన్ చేసి డెస్క్ టాప్ లో కనెక్ట్ కావాలి. అయితే ఆఫీసుల పని.. గ్రూపుల్లో సందేశాలు పంపుకోవడానికి మొబైల్ కంటే డెస్క్ టాప్ పై ఈజీ.కానీ ఆ సౌకర్యం కొంచెం కఠినంగా ఉండడంతో ఇప్పుడు మరిన్ని మెరుగులు దిద్దేందుకు నడుం బిగించింది.

తాజాగా ఫోన్ లో డేటా లేకపోయినా.. మొబైల్ ఆఫ్ లో ఉన్నా కూడా డెస్క్ టాప్ వెర్షన్ పనిచేసేలా తీర్చిదిద్దుతున్నారు. ఇక ఒకే అకౌంట్ పై పలు డివైజ్ లలో ఒకేసారి పనిచేసేలా వాట్సాప్ దీన్ని రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ డెస్క్ టాప్ వెర్షన్ ముఖ్యంగా ఉద్యోగులకు వరంగా మారనుంది. అయితే ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియదు. దీనికోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -