Friday, April 19, 2024
- Advertisement -

ఉగ్రనిధుల కేసులో ఎన్‌ఐఏ కోర్టు తీర్పు

- Advertisement -

కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు జీవిత ఖైదు విధిస్తూ ఎన్‌ఐఏ కోర్టు తీర్పు చెప్పింది. జైలు శిక్షతో పాటు పది వేల రూపాయల జరిమానా విధించింది. ఉగ్రవాదుల కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో యాసిన్ మాలిక్‌ను ఇప్పటికే దోషిగా తేల్చిన కోర్టు తాజాగా ఈ తీర్పు వెలువరించింది. ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చినట్లు 2017లో మాలిక్‌పై కేసు నమోదైంది.

ఫ్రీడమ్ స్ట్రగుల్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా నిధుల సేకరణకు ఒక వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు ఎన్‌ఐఏ ఆధారాలను సమర్పించింది. యాసిన్ మాలిక్‌ సైతం ఇటీవలే నేరాన్ని అంగీకరించాడు. దీంతో ఈ కేసులో మాలిక్‌కు మరణిశిక్ష విధించాలని ఎన్‌ఐఏ వాదించింది.

అయితే కోర్టు మాత్రం జీవిత ఖైదు విధించింది. మరోవైపు కోర్టు తీర్పు నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. యాసిన్ మాలిక్ ఇంటి సమీపంలో డ్రోన్లతో పరిస్థితి పర్యవేక్షించారు. అయినా యాసిన్ మాలిక్ మద్దతుదారులు కశ్మీర్‌లో పలు చోట్ల నిరసనలు చేపట్టారు.

కోనసీమ అల్లర్ల అనుమానితుడి అరెస్టు

గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం

కాంగ్రెస్‌కు కపిల్ సిబల్ రాజీనామా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -