Thursday, May 2, 2024
- Advertisement -

ఎస్పీవై రెడ్డి అంతు చూడటానికి వైకాపా ప్రయత్నం..!

- Advertisement -

తమ పార్టీ తరపున గెలిచి.. తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా చెలామణి అవుతున్న నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డిపై అనర్హత వేటు కోసం తీవ్ర ప్రయత్నాలనే చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.

ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండు మూడు రోజుల్లోనే ఫిరాయింపుకు పాల్పడి ఏడాదిన్నర నుంచి దర్జాగా అధికార పార్టీ ఎంపీగా చెలామణి అవుతున్న ఎస్పీవై పై ఇప్పటికే వైకాపా లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. ఆయన ఫిరాయింపుకు పాల్పడ్డాడు కాబట్టి.. ఆయన పై వేటు వేయాలని కోరుతోంది.

తాజాగా వైకాపా ఫిర్యాదు లోక్ సభ హక్కుల సంఘం విచారణకు వచ్చింది. ఎస్పీవై ఫిర్యాదుకు సంబంధించి వైకాపా పూర్తి ఆధారాలను సమర్పించింది. ఆయన ఫిరారయింపుకు పాల్పడ్డాడని.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించాడని.. టీవీ చానల్ వీడియోలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటీకి సమర్పించింది. ఈ కమిటీలో అహ్లూవాలియా, జ్యోతిరాధిత్య సింధియా, తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని తదితరులు ఉన్నారు. అయితే ఈ విచారణకు హాజరు కావాల్సిన ఎస్పీవై రెడ్డి డుమ్మా కొట్టాడు. తనకు ఆరోగ్యం సరిగా లేదనే కారణంతో ఆయన విచారణకు హాజరు కాలేదు.

మరి ఇలా డుమ్మా కొట్టి విచారణ నుంచి తప్పించుకొనే యత్నం చేశాడు ఎస్పీవైరెడ్డి. మరి ఆయన ఇలా ఎన్ని రోజులు తప్పించుకొంటాడనేది ఇక్కడ ఆసక్తికరమైన అంశం. ఇప్పటికే ఏడాది గడిచిపోయింది… ఇప్పుడు ఎస్పీవైపై అనర్హత వేటు పడితే.. నంద్యాల పార్లమెంటరీ నియోజకవర్గానికి

ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. మరి ఎస్పీవై ఎన్ని రోజులు ఇలాగే తప్పించుకొంటాడో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -