Wednesday, May 1, 2024
- Advertisement -

యూట్యూబ్ ఆఫీస్ వ‌ద్ద మ‌హిళ కాల్పులు..

- Advertisement -

శాన్‌ఫ్రాన్సిస్కో సమీపంలోని శాన్‌బ్రూనోలో ఉన్న యూట్యూబ్‌ ప్రధాన కార్యాలయం వద్ద ఓ మహిళ కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో నలుగురు గాయపడగా, అనంతరం ఆమె తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కాల్పుల విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించారు.

ఆమెకు యూట్యూబ్‌లో పలు వీడియో చానెళ్లు ఉన్నట్టు సమాచారం. తన యూట్యూబ్‌ చానెల్‌లో ఐదువేలమంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారని, ఎక్కువ వ్యూస్‌ వచ్చేవని, కానీ తన వీడియోలను యూట్యూబ్‌ ఫిల్టర్‌ చేస్తుండటంతో వ్యూస్‌ తగ్గిపోయి.. తనకు ఆదాయం ఏమీ రావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో యూట్యూబ్‌ తీరుపై ఆగ్రహంతోనే ఆమె కాల్పులకు దిగినట్టు తెలుస్తోంది.

గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కాల్పుల విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించారు. కాల్పులకు పాల్పడిన మహిళే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని వారు భావిస్తున్నామ‌ని పోలీసులు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -