Wednesday, May 8, 2024
- Advertisement -

ప్రత్యేక హోదా కోసం పోరాటం

- Advertisement -

ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా అంశం ఇవాళ అసంబ్లీ ని కుదిపేసింది. బుధవారం నాటి కేంద్రం ఇచ్చిన స్టేట్మెంట్ ని ఎఫ్ఫెక్ట్ చేసుకుని మరీ సభ లోని విపక్ష సభ్యులు రెచ్చిపోయారు. అసలే రెండు మూడు రోజుల పాటు సభ నిర్వహించే షెడ్యూల్ వేసుకున్న చంద్రబాబు కి జగన్ వర్గం ఊహించని షాక్ ఇచ్చింది.

గురువారం సభ ప్రారంభం కాగానే.. హోదా అంశంపై అధికార టీడీపీని ఇరుకున పెట్టేందుకు జగన్ పార్టీ వైకాపా తీవ్రంగా ప్రయత్నించింది. హోదా ఇచ్చేదిలేదని ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటించడం దీనిని చంద్రబాబు అర్ధరాత్రి దాటిన తర్వాత నిర్వహించిన మీడియా మీటింగ్లో స్వాగతించడాన్ని జగన్ పార్టీ సభ్యులు తీవ్రస్థాయిలో తప్పుపట్టారు. హోదా ఆంధ్రుల హక్కు అంటూ వైకాపా సభ్యులు నినాదాలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై తక్షణమే చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు.

అయితే ఈ విషయంపై ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తుందని అప్పటి వరకు దీనిపై ఎలాంటి అనుమతులూ ఉండబోవని సభావ్యవహారాల మంత్రి హోదాలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు. అయినా కూడా వైకాపా సభ్యులు శాంతించలేదు. దీంతో మైకు తీసుకుని రంగంలోకి దిగిన టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు – మంత్రి అచ్చెన్నాయుడులు తమ స్టైల్ లో వైకాపాపై విరుచుకుపడ్డారు.

అసలు వైకాపాకే హోదాపై చిత్తశుద్ధి లేదని బోండా విమర్శలు గుప్పించారు. జగన్ కు ఈ విషయంలో క్లారిటీ ఉంటే.. ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి ముందు ధర్నాకు ఎందుకు దిగలేదని ప్రశ్నించారు. ఈ సమయంలో స్పీకర్ మైక్ ఇవ్వడంతో మాట్లాడిన జగన్.. హోదాపై రెండు సార్లు ఇదే సభలో తీర్మానం చేసి.. పంపామని గుర్తు చేశారు.

Related

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -