Sunday, April 28, 2024
- Advertisement -

అనంతబాబు కోసం గాలింపు ముమ్మరం

- Advertisement -

వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంత బాబును పోలీసులు ప్రధాన నిందితుడిగా చేర్చారు. ప్రత్యేక బృందాలతో అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మృతుడి కుటుంబీకుల స్టేట్‌మెంట్ ఆధారంగా అనంత బాబును అరెస్టు చేస్తామని పోలీసులు వెల్లడించారు. మరోవైపు సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయ్యింది.

శనివారం ఉదయం నుంచి అర్థరాత్రి వరకు హైడ్రామా నడిచింది. అనంత బాబును అరెస్టు చేసే వరకు పోస్టుమార్టం చేసేందుకు అంగీకరించబోమని సుబ్రహ్మణ్యం కుటుంబం తొలుత తేల్చిచెప్పింది. మరోవైపు దళిత సంఘాల ఆందోళనలతో ఈ వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అనంతబాబును అరెస్టు చేస్తామంటూ పోలీసులు ప్రకటించడంతో బాధిత కుటుంబం వెనక్కు తగ్గింది.

మృతుడి భార్యకు ఆర్థిక సాయం చేస్తామనీ.. ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. దాంతో సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోస్టుమార్టం చేసేందుకు అంగీకరించింది.

జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఫోకస్

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ బూటకమన్న సిర్పూర్కర్ కమిషన్

మంత్రుల దగ్గరకు వెళ్లొద్దు.. నేనే సీనియర్‌ను..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -