Tuesday, April 30, 2024
- Advertisement -

ఏపీలో పొత్తు కుదిరిందా….?

- Advertisement -

తెలంగాణాలో లాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా కాంగ్రెస్‌, టీడీపీ పొత్తు కుదిరిందా…? ఎన్డీఏను ఎదుర్కొనేందుకు బాబు జాతీయ స్థాయిలో కూట‌మిని ఏర్పాటుకు ప్ర‌య‌త్నిస్తున్నాన‌ని గొప్ప‌లు చెప్పుకుంటున్నా ఆ దిశ‌గా అయితే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. తెలంగాణా ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా హైద‌రాబాద్‌లో రాహుల్ తో స‌మావేశ మ‌య్యారు చంద్ర‌బాబు. ఏపీలో పొత్తుపై సుదీర్ఘంగా చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది.

తెలంగాణాలో ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఖ‌మ్మం జిల్లాలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌జాకూట‌మి త‌రుపున ప్ర‌చారం నిర్వ‌హించారు. నాలుగు ద‌శాబ్దాలుగూ ఉప్పు నిప్పులా ఉన్న రెండు పార్టీలో ఒకే వేదిక‌ను పంచుకోవ‌డం చారిత్ర‌క‌మైన ఘ‌ట్టంగా బాబు అభివ‌ర్ణించారు.

ఏపీలో ఇరు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా? లేదా? అన్న అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్-టీడీపీల మధ్య పొత్తు అంశంపై కూడా రాహుల్- చంద్రబాబు మధ్య బుధవారం చర్చకు వచ్చినట్లు సమాచారం. అయితే పొత్తు, సీట్ల వ్య‌వ‌హారంలో ఫైన‌ల్ నిర్ణ‌యాన్ని రాహుల్ బాబుకే వ‌ద‌లేసిన‌ట్లు తెలుస్తోంది. మ‌రో వ‌పైపు ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షుడు ర‌ఘువీరాకూడా పొత్తు కోసం పార్టీ నేత‌లు త్యాగాలు చేయాల్సిందేన‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.

తెలంగాణలో మరో పది రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. వాటి ఫలితాలు కూడా వెంటనే విడుదలౌతాయి. తెలంగాణలో పరిస్థితిని చూసి.. అప్పుడు ఏపీలో పొత్తు గురించి అధికారికంగా ప్రకటన చేద్దామని చంద్రబాబు భావిస్తున్నారని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ‘ప్రస్తుతం ఎవరేమనుకుంటున్నా అవి ఊహాగానాలే. తగిన సమయంలో చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -