Monday, April 29, 2024
- Advertisement -

జ‌గ‌న్ ఎప్పుడూ సీఎం కాలేరు…

- Advertisement -

ఎవ‌రినైనా ముక్కుసూటిగా మాట్లాడె నాయ‌కుల‌లో ముందుగా చెప్పుకొనేది అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి. ఆయ‌న ఏం మాట్లాడినా సంచ‌ల‌నంగా ఉంటాయి. మ‌న‌సులో ఏది దాచుకోకుండా మంచో….చెడో బ‌య‌ట పెడ్తూ వార్త‌ల్లో ఉంటారు. వైసీపీ అధినేత జ‌గ‌న్ ను విమ‌ర్శించ‌డంతోపాటు ….చంద్ర‌బాబుపైకూడా త‌న దైన శైలిలో విమ‌ర్శిస్తుంటారు.

అయితే తాజాగా ఓ ఛాన‌ల్‌కు ఇచ్చ‌న ఇంట‌ర్వూలో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా రెండో దఫా ఎన్నికైన సమయంలో జేసీ మంత్రి వ‌ర్గంలో చోటు క‌ల్పించ‌లేదు. దాంతో వైఎస్ఆర్,జేసీకి మ‌ధ్య దూరం పెరిగింద‌నె వార్త‌లు బ‌లంగా వినిపించాయి.

రెండో ద‌ఫా మంత్రి వ‌ర్గంలోకి ఎందుకు తీసుకోలేదొ జేసీ క్లారిటీ ఇచ్చారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చనిపోవడానికి ఒక్కరోజు ముందే మంత్రిపదవి ఎందుకు ఇవ్వలేదో తెలుసుకొందామని వెళ్లినట్టు జెసి దివాకర్‌రెడ్డి చెప్పారు. మంత్రి పదవి ఇవ్వకపోవడానికి మీ జిల్లా వాళ్లే కారణమంటూ కొన్ని ఫిర్యాదులు నాకు చూపించాడు. వాటిని చూసి ఆయనకు అన్నీ వివరించ‌డంతో వైఎస్‌ సంతృప్తి చెందార‌న్నారు.

వైఎస్ఆర్ చనిపోవడానికి సరిగ్గా ఒక్కరోజు ముందు… నన్ను పిలిపించుకున్నారు. ‘నేను మేడంను ఒప్పించాను. మిమ్మల్ని కేబినెట్‌లోకి తీసుకుంటున్నాను. నేను చిత్తూరు పోతున్నా. రాగానే మంచి రోజు చూసుకుని నిన్ను మంత్రివర్గంలోకి తీసుకుంటా’ అని చెప్పారు. అయితే, దురదృష్టవశాత్తూ ఆయన వెళ్లిపోయారు.

జ‌గ‌న్‌పై కూడా త‌న దైన శైలిలో విమ‌ర్శ‌లు చేశారు. వైఎస్‌కు సన్నిహితులు చాలా మంది ఉన్నారు. జగన్‌ తెలివైన వాడై ఉంటే… స్వయంగా వెళ్లి వాళ్లందరినీ అడిగితే అందరూ చేరేవారు. ఉప ఎన్నికల్లో 32 సీట్లలో గెలిచానన్న అహంకారంతోనే మొత్తం కాలదన్నుకున్నాడు. గెలుపు వైఎస్‌ మరణంతో, సానుభూతి వల్లనే లభించింద‌ని మ‌రిచిపోయి సొంత బ‌లంతోనె నెగ్గాన‌ని అనుకున్నాడు. ఇక జ‌గ‌న్ ఎప్ప‌టికి సీఎం కాలేడ‌న్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -