Monday, April 29, 2024
- Advertisement -

వైసీపీ లో ముసలం.. అంబటి రాంబాబు పై వ్యతిరేకత..?

- Advertisement -

జగన్ కు అత్యంత ఆప్తుడు, వైసీపీ లో కీలక నాయకుడు అయిన అంబటి రాంబాబు పై అయన సొంత నియోజకవర్గం నుంచే తీవ్రమైన నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అంబటి రాంబాబు పై దీనిపై చాల సార్లు వివరణ ఇచ్చారు.. ఇక ఈ నియోజక వర్గం పరిస్థితి చూసుకుంటే అంబటి ఆదిలోనే హంసపాదు అన్నట్లు రాంబాబు కి సత్తెనపళ్లు నుంచి టికెట్ ఇవ్వొద్దని నియోజక వర్గంలో ని మరో వైసీపీ వర్గం పార్టీ అధిష్ఠానాన్ని విన్నవించుకుంది.. ఎన్నికల సమయంలో పార్టీ కార్యాలయం ఎదుట నిరసనలు వ్యక్తం చేశారు కూడా..2014 లా వైసీపీ చెందుతుంది అని హెచ్చరించినా జగన్ అవేమీ పట్టించుకోకుండా అంబటి కే టికెట్ ఇచ్చారు.. ఫలితంగా స్వల్ప తేడాతో అంబటి ఆ సీటు ను నెగ్గారు..

ఇక అప్పటినుంచి ఆ వర్గం పై అంబటి కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు వారు ఆరోపిస్తున్నారు.. వారికి రావాల్సిన కాంట్రాక్టులను రానివ్వకుండా చేయడం, అక్రమంగా కేసులు బనాయించడం వంటివి చేస్తున్నారని వారి ఆరోపణ.. అంతేకాకుండా ఈ వర్గంలో అన్ని సామజిక వర్గనేతలుండగా దీనికి నాయకత్వం కూడా రెడ్డి సామజిక వర్గానికి చెందిన నేత వహిస్తుండడం విశేషం.. ఇక వీరు అంబటి ద్వారా తమ పనులు జరగడం లేదని పార్టీ లోని ఇతర సీనియర్ నాయకుల ద్వారా తమ పనులు చేసుకుంటున్నారని తెలుస్తుంది. వారి ద్వారా అంబటి రాంబాబు ను తొక్కేయడానికి వారు ప్లాన్స్ వేస్తున్నారట..

ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబుపై అక్రమ మైనింగ్ కేసును వాళ్లే హైకోర్టులో దాఖలు చేయడం విశేషం. సత్తెనపల్లి నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ కు అంబటి రాంబాబుతో సహా మరికొందరి వైసీపీ నేతలపై హైకోర్టులో వారు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీంతో హైకోర్టు వారికి నోటీసులు జారీ చేసింది. దానికి అంబటి గట్టిగానే స్పందిస్తూ కొందరు కావాలనే పనిగట్టుకుని తనపై దుష‌్ప్రచారం చేస్తున్నారని, వాస్తవాలు నిదానంగా తెలుస్తాయని అంటున్నారు. అక్రమ మైనింగ్ కు ప్రయత్నించి విఫలమయిన వారే తనపై కేసు వేశారంటున్నారు. మొత్తం మీద అంబటి రాంబాబుకు సత్తెనపల్లి నియోజకవర్గంలో సొంత పార్టీలోనే సెగ బాగానే ఉందని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -