Thursday, May 2, 2024
- Advertisement -

బాబు విదేశీ ప‌ర్య‌ట‌న త‌ర్వాత కేబినేట్ పుణ‌ర్ వ్య‌వ‌స్తీక‌ర‌ణ‌..రెడ్డి సామాజిక వ‌ర్గానికి పెద్ద‌పీట‌..

- Advertisement -

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఎన్నిక‌ల‌కు కొత్త క్యాబినేట్‌తో వెల్లేందుకు సిద్ద‌మ‌వుతున్నారు. మ‌రో సారి మంత్రి వ‌ర్గ పుణ‌ర్ వ్య‌వ‌స్తీక‌ర‌ణ చేప‌ట్ట‌బోతున్నారు. అయితే తాజాగా మరోసారి ఎలక్షన్ కేబినెట్ ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త క్యాబినేట్‌లో కొత్త మొహాలు క‌నిపించ‌నున్నాయి.

చంద్రబాబు విదేశీ పర్యటనల అనంతరం ఈ పునర్వ్యవస్థీకరణ ఉండబోతోందనే టాక్ వినిపిస్తోంది. ఈనెల 18 నుంచి 26వ తేదీ వరకూ చంద్రబాబు మూడు దేశాల్లో పర్యటించనున్నారు. తిరిగి వచ్చిన తర్వాత ఈ నెలాఖరులో కానీ, వచ్చే నెల మొదటివారంలో కానీ మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించే అవకాశం కనిపిస్తోంది.

మంత్రి వ‌ర్గ పుణ‌ర్‌వ్య‌వ‌స్థీక‌ణ‌లో కొత్త మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఆర్థిక మంత్రిగా ఉన్న య‌నుమ‌ల రామ‌కృష్ణుడును త‌ప్పించి …ఆయ‌న స్థానంలో నెల్లూరుకు చెందిన సీనియ‌ర్‌నేత ఆనం రామనారాయణ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకోవడం దాదాపు ఖాయమైంది. ఆయనకు ఆర్థిక శాఖను కట్టబెట్టనున్నారు.

చాలాకాలంగా ఆనం బ్ర‌ద‌ర్స్ బాబుమీద గుర్రుగా ఉన్నారు. పార్టీలో చేర్చుకొని ఏమాత్రం మ‌మ్మ‌ల్ని ప‌ట్టించుకోవ‌డంలేద‌ని బ‌హిరంగంగానె విమ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. ఆయనకు ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చి కేబినెట్ లోకి తీసుకోవడం ఖాయమైపోయింది. పార్టీ ఫిరాయించి మంత్రులుగా కొన‌సాగుతున్న వారిలో కొద్ది మందిపై వేటు ప‌డే అవ‌కాశం ప‌క్కా అని తెలుస్తోంది.

మిగిలిని మంత్రుల్లో కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు.. తదితరుల శాఖల్లో మార్పులుండే అవకాశం ఉంది. బీజేపీ అధిష్టానం మరెవరిపేర్లైనా సూచిస్తే కామినేని, మాణిక్యాలరావుల్లో ఎవరో ఒకర్ని తొలగించి కొత్తవారికి ఛాన్స్ ఇవ్వచ్చు. ఈ మంత్రి వ‌ర్గంతోనె బాబు ఎన్నిక‌ల‌కు వెల్ల‌నున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -