Monday, April 29, 2024
- Advertisement -

టిడిపిలో టెన్షన్ టెన్షన్……… ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలో అన్న భయం

- Advertisement -

అవినీతి కేసుల విషయంలో స్టేలు తెచ్చుకుని కొనసాగే పరిస్థితి ఉండరాదంటూ రీసెంట్‌గానే సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చింది. ఇప్పటికే స్టేలు తెచ్చుకుని ఉన్నవాళ్ళ స్టేలు ఎత్తేయాలని……ఆరు నెలలకు మించి స్టే ఉండరాదని కూడా తీర్పు ఇచ్చింది. ఆ వెంటనే టిడిపి జనాలందరూ కూడా ఉలిక్కిపడ్డారు అన్న మాట వాస్తవం. అంతర్గతంగా టిడిపి నాయకులే 2019 ఎన్నికల నాటికి పరిస్థితి ఏంటి? 2019ఎన్నికల్లో ఓడిపోతే ఆ తర్వాత బాబు పరిస్థితేంటి అని ఆందోళనగా చర్చోపచర్చలు చేస్తున్నారు.

మరోవైపు వైఎస్ జగనేమో చంద్రబాబు అవినీతి వ్యవహారాలు క్లైమాక్స్‌కి వచ్చాయని చెప్తున్నాడు. వైకాపా ఎంపి విజయసాయిరెడ్డి చంద్రబాబు అవినీతిపై సాక్ష్యాధారాలతో సహా తయారు చేసిన ఒక ఫైల్‌ని మోడీకి ఇచ్చాడని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈ మధ్యనే తన కాలంలో రాసుకొచ్చాడు. అఫ్కోర్స్…..వేరే ఎవరి అవినీతి గురించి అయినా అయి ఉంటే విజయసాయిరెడ్డిని శభాస్ అని పొగిడేవాడేమో రాధాకృష్ణ. కానీ చంద్రబాబు అవినీతి వ్యవహారలపై సాక్ష్యాధారాలు సేకరించడం, ప్రధానితో సహా సంబంధిత సంస్థలన్నింటికీ ఆ ఆధారాలు పంపిస్తూ ఉండడం మాత్రం పచ్చ బ్యాచ్ అందరికీ మహా కంటగింపు అయిపోయింది. విజయసాయిరెడ్డి ఘోరాలు, నేరాలు చేస్తున్నాడని ఉలికులికి పడుతూ ఆవేశంగా రంకెలు వేస్తున్నారు. అయినా చంద్రబాబు అంత నిప్పు అయితే విజయసాయి ఏదో చేస్తున్నాడని ఉలిక్కిపడడం ఎందుకు అంటే సమాధానం ఉండదు?

ఇక తాజాగా ఢిల్లీ టూర్‌లో ఎన్టీఆర్ వెన్నుపోటు కాలం నుంచీ కూడా తనకు అండగా ఉన్న ఇద్దరు న్యాయమూర్తులను చంద్రబాబు రహస్యంగా భేటీ అయ్యారని నేషనల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీలో ఇదే హాట్ టాపిక్ అయింది. అన్నింటికీ మించి తెరవెనుక ఏం జరుగుతుందో అర్థం కాక…..వాళ్ళ నాయకుడికి ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో తెలియక సతమతమవుతున్నారు. ఎందుకైనా మంచిదని ముందుగానే బాబుపై కుట్రలు పన్నుతున్నారు, కేసులు పెట్టేలా ఉన్నారు, జైలుకు పంపించేలా ఉన్నారు, అంతా కుట్ర అంటూ టెన్షన్ పడిపోతున్నారు. చంద్రబాబు కూడా అవే మాటలు మాట్లాడుతున్నాడు. ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -