Saturday, April 27, 2024
- Advertisement -

జగన్ ను దెబ్బతీసేందుకు కిరణ్ కుమార్ ఎంట్రీ..?

- Advertisement -

చంద్రబాబు రాజకీయ చతురత గురించి అందరికి తెలిసిందే.. కుడితే మంచి తోనే తప్పిస్తాడు, లేదంటే వెన్నుపోటు పొడిచి అయినా సరే తనకు కావాల్సింది దక్కించుకు తీరుతాడు. అయితే గత ఎన్నికల్లో ఘోర పరాజయం పొందినా కూడా చంద్రబాబు ఎక్కడ కూడా ఢీలా పడిపోలేదనే వార్త మెల్ల మెల్లగా బయటకి వస్తుంది.. ఎందుకంటే వచ్చే ఎన్నికల నాటికీ జగన్ ఎలా దెబ్బ తీయాలో అని ఇప్పటినుంచే వ్యహ రచన చేస్తున్నాడట.. దానికి జగన్ తో విభేదాలు, విరోధాలు, దూరం గా ఉన్నవారి ని లిస్ట్ ను తయారు చేసి వారి తో మంతనాలు చేసి కులం తో కొట్టాలని అయన భావిస్తున్నారట..

ఇక చంద్రబాబు ఈ విధానం లో భాగంగా కిరణ్ కుమార్ రెడ్డి ని రంగంలోకి దించాలని చూస్తున్నాడట.. జగన్ ఈ ఇద్దరికీ ఉమ్మడి శత్రువు అని తెలిసిందే.. ఎందుకంటే కిరణ్ ఇలా సీఎం గా ప్రమాణం చేయగానే అలా జగన్ కాంగ్రెస్ ను వీడారు, అంతేనా కిరణ్ సర్కార్ కి పెను సవాల్ గా మారి ఆయన‌ మూడేళ్ళ పదవీకాలంలో ముప్పతిప్పలు పెట్టారు. ఇపుడు చంద్రబాబు ఒక వైపు జగన్ తో పోరాడుతూంటే కాంగ్రెస్ పేరు చెప్పుకుని జగన్ ని ఇబ్బంది పెట్టేందుకు కిరణ్ కుమార్ రెడ్డి కూడా వస్తారట.. ఇక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పై ప్రజలకు అంత గా కోపం ఇప్పుడు లేదని, మాలీ కాంగ్రెస్ ని పుంజుకునేలా చేయాలంటే ఇదే మంచి తరుణమని అయన భావిస్తున్నారట..

ఇక కాంగ్రెస్ లో ముఖ్యమంతి గా పనిచేసిన వైఎస్సార్ పేరు చెప్పి పార్టీ కి మళ్ళీ పునాదులు వేయబోతున్నారట..
అలా జగన్ వైసీపీ నుంచి వైఎస్సార్ ని ఆయన లాగేస్తారట. అంతే కాదు వైసీపీ రెడ్లకు కూడా గేలం వేస్తారట. కాంగ్రెస్ కి జనంలో బలం పెంచితే మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంక్ కొంత అయినా ఇటు వస్తుందని కిరణ్ భావిస్తున్నారుట. కరోనా ఇలా తగ్గగానే అలా ఏపీకి రాహుల్, ప్రియాంకలు వస్తారని కూడా టాక్. మొత్తానికి కిరణ్ ఈ మధ్య హడావుడిగా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలకు ఇచ్చిన నివేదిక వెనక చంద్రబాబు డైరెక్షన్ ఉందా అంటే ఏమో బాబును తక్కువ అంచనా వేయకూడద‌నే సమాధానం వస్తోంది. ఏదేమైనా జగన్ ని దెబ్బతీయడానికి చంద్రబాబు మహామంత్రి తిమ్మరాజు అవతారం ఎత్తాడనీ చెప్పొచ్చు..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -