Monday, April 29, 2024
- Advertisement -

న్యాయవాద దంపతుల హత్య నోరు విప్పిన సీఎం కేసీఆర్!

- Advertisement -

పెద్దపల్లి జిల్లాలోని రామగిరి మండలం కల్వచర్ల వద్ద గత నెల 17న హత్యకు గురైన న్యాయవాద దంపతులు వామన రావు, పీవీ నాగమణిల హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఇప్పటి వరకు 25 మంది సాక్షులను పోలీసులు విచారించారు. కుంట శ్రీను, చిరంజీవి, కుమార్ వాంగ్మూలాలు మెజిస్ట్రేట్ ఎదుట నమోదు చేశారు. బిట్టు శ్రీను, లచ్చయ్య వాంగ్మూలాల నమోదు కోసం కోర్టులో పోలీసులు దరఖాస్తు చేశారు. సిసి టీవీ, మొబైల్ దృశ్యాలను ఎఫ్ఎస్ఎల్‌కి పంపించామని పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు. 

ఇదిలా ఉంటే తాజాగా న్యాయవాద దంపతుల హత్య కేసు దురదృష్టకరమని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేశారని వెల్లడించారు. పోలీసులు నిపక్షపాతంగా కేసును ఛేదిస్తున్నారని తెలిపారు.

ఈ కేసులు ఎంతటి వారినైనా నిర్మోహమాటంగా అరెస్ట్ చేసి శిక్ష విధిస్తామని అన్నారు. న్యాయవాద దంపతుల హత్యకు టి. ఆర్. ఎస్ కి సంబంధంలేదని కేసీఆర్ వెల్లడించారు. నిందితుడిగా ఉన్న టి. ఆర్. ఎస్ నేతను పార్టీ నుంచి అప్పటికప్పుడే తొలగించామని… వెంటనే అతను అరెస్టు కూడా అయ్యారని ముఖ్యమంత్రి తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -