Sunday, April 28, 2024
- Advertisement -

25 మందితో పూర్తి స్థాయి మంత్రి వ‌ర్గాన్ని ఏర్పాటు చేయ‌నున్న సీఎం జ‌గ‌న్‌…

- Advertisement -

మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు వేల‌య్యింది. ఎల్లుండి అంటె 8న సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మంత్రి వ‌ర్గాన్ని ఏర్పాటు చేయ‌నున్నారు. కేబినేట్‌లో ఎవ‌రికి ప‌దువ‌లు ద‌క్కుతాయోన‌నె ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. తన మంత్రివర్గంలో సీనియారిటీ, పార్టీ విధేయులు, ఆది నుంచి తన వెన్నంటి నడిచిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కుల‌, సామాజికి వ‌ర్గాల వారిగా కేబినేట్‌లో ప్రాధాన్యం ఇవ్వ‌నున్నారు. ఇప్ప‌టికే ఓనిర్ణ‌యానికి జ‌గ‌న్ వ‌చ్చిన‌ట్లు పార్టీ వ‌ర్గాలు తెలిపాయి.

మరో రెండు రోజుల్లో జగన్ కేబినెట్ ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో ఎవరెవరిని మంత్రి పదవులు వరిస్తాయి ఏయే సామాజిక వర్గాలకు కీలక పదవులు కట్టబెట్టబోతున్నారంటూ వైసీపీలో ఉత్కంఠ నెలకొంది. ఇక సామాజిక వర్గాల వారీగా, ఎవరికీ అన్యాయం జరుగకుండా పదవుల పంపకాన్ని ఆయన పూర్తి చేశారని చెబుతున్నాయి. జగన్ కేబినెట్ లో రెడ్డి సామాజిక వర్గం నుంచి ఏడుగురికి అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

బీసీ సామాజిక వర్గం నుంచి ఆరుగురికి, కాపు, కమ్మ, ఎస్సీ మాల వర్గాల నుంచి ఇద్దరేసి చొప్పున, ఎస్సీ మాదిగ, ఎస్టీ, క్షత్రియ, ముస్లిం, మైనారిటీ, బ్రాహ్మణ, వైశ్య సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరి చొప్పున జగన్ ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. అంటే, మొత్తం 25 మందితో ఆయన పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయబోతున్నారన్నమాట

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -